Gold Price Today: బంగారం కొంటున్నారా.. ఓసారి ధర చూడండి.. తులం ఎంత పెరిగిందంటే?

|

Jun 29, 2024 | 7:15 AM

హైదరాబాద్‌లో చూస్తే.. గోల్డ్ రేట్స్ క్రమేపి తగ్గుతూ వస్తున్నాయి. జూన్ 21న బంగారం ధరలు గమనిస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,150గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,250గా ఉంది. ఈ పసిడి ధరలు శనివారం నాటికి 22 క్యారెట్లు గోల్డ్ రూ. 66,160గా.. 24 క్యారెట్ల బంగారం రూ. 72,170గా కొనసాగుతోంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనూ ఇదే ధర ఉంది.

Gold Price Today: బంగారం కొంటున్నారా.. ఓసారి ధర చూడండి.. తులం ఎంత పెరిగిందంటే?
Gold Price Today
Follow us on

Gold Price Today: గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు.. శనివారం(29 జూన్) రోజున మాత్రం కొంతమేర పెరిగి షాకిచ్చాయి. గత 7 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 1,520 మేరకు తగ్గింది. కాగా నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10ల మేర పెరిగింది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడం, మరలా పెరగడంతో.. ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా పడుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ గోల్డ్, సిల్వర్ ధరల్లో వారం రోజులుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

హైదరాబాద్‌లో చూస్తే.. గోల్డ్ రేట్స్ క్రమేపి తగ్గుతూ వస్తున్నాయి. జూన్ 21న బంగారం ధరలు గమనిస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,150గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,250గా ఉంది. ఈ పసిడి ధరలు శనివారం నాటికి 22 క్యారెట్లు గోల్డ్ రూ. 66,160గా.. 24 క్యారెట్ల బంగారం రూ. 72,170గా కొనసాగుతోంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనూ ఇదే ధర ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,310, 24 క్యారెట్ల ధర రూ.72,340 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.66,160, 24 క్యారెట్లు రూ.72,170, చెన్నైలో 22క్యారెట్లు రూ.66,670, 24 క్యారెట్లు రూ.72,730, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.66,160, 24 క్యారెట్లు రూ.72,170గా ఉంది.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22క్యారెట్లు రూ.66,160, 24 క్యారెట్లు రూ.72,170 లుగా ఉంది.

వెండి ధరలు ఇలా..

వెండి ధరలు మాత్రం తగ్గాయి. గతవారం రోజులుగా వెండి నేల చూపులు చూస్తోంది. శనివారం కిలో వెండి ధర రూ. 89,900 లకు చేరింది. నిన్నటితో పోల్చితే దాదాపుగా రూ. 100లు మేర తగ్గింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 94,400గా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.89,900, ముంబైలో రూ.89,900, బెంగళూరులో రూ.89,400, చెన్నైలో రూ.94,400, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.94,400 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..