Gold Price Today: షాకిచ్చిన బంగారం ధర.. మంగళవారం తులం ఎంత పెరిగిందంటే?

|

Jul 30, 2024 | 6:17 AM

Gold Price Today: భారతదేశంలో బంగారం రిటైల్ ధర, వినియోగదారులకు యూనిట్ బరువుకు తుది ధరను ప్రతిబింబిస్తుంది. బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా చాలామంది భావిస్తుంటారు. అందుకే ప్రతిరోజూ బంగారం ధరపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత తులం బంగారం ధర దాదాపు రూ. 5 వేల వరకు తగ్గడంతో బంగారం కొనే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.

Gold Price Today: షాకిచ్చిన బంగారం ధర.. మంగళవారం తులం ఎంత పెరిగిందంటే?
Gold
Follow us on

Gold Price Today: భారతదేశంలో బంగారం రిటైల్ ధర, వినియోగదారులకు యూనిట్ బరువుకు తుది ధరను ప్రతిబింబిస్తుంది. బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా చాలామంది భావిస్తుంటారు. అందుకే ప్రతిరోజూ బంగారం ధరపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుముఖం పడుతోంది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత తులం బంగారం ధర రూ. 10 వేల వరకు తగ్గడంతో బంగారం కొనే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ రోజు (మంగళవారం) జులై 30, 2024 బంగారం, వెండి ధరలలో స్వల్ప పెరుగుదల ఉంది. మంగళవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే బంగారం ధర రూ.10 పెరిగింది. అదే సమయంలో వెండి ధరలో రూ.100 పెరుగుదల నమోదైంది. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం?

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 69,170లుగా నమోదైంది. సోమవారం గురించి మాట్లాడితే, బంగారం రూ. 69140ల వద్ద ముగిసింది. అలాగే, వెండి ధరలో పెరుగుదల కనిపించింది. ఈరోజు వెండి ధర రూ.100 పెరిగింది.

కాగా, బంగారం, వెండి సహా పలు ఉత్పత్తులపై ప్రభుత్వం ఇటీవల కస్టమ్స్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. దిగుమతి చేసుకున్న బంగారంపై భారతదేశం ఆధారపడటం దేశీయ ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది ప్రపంచ ధోరణులను దగ్గరగా ప్రతిబింబిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో బంగారం రిటైల్ ధర..

దేశరాజధాని న్యూఢిల్లీలో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,560లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,320ల వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.63,410లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,170 లుగా నమోదైంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,140కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,970ల వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,410లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 69,170 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

హైదరాబాద్‌లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,170 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63,410లు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,170లుగా నమోదైంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆదివారం వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు కనిపించలేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబయి, పుణెలో కిలో వెండి ధర రూ. 84,400కి చేరింది. అలాగే చెన్నై, హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 88,900ల వద్ద కొనసాగుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..