ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన గౌతమ్ ఆదానీ ఎవరికి అందనంత ఎత్తులో దూసుకుపోతున్నారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇతర వ్యాపార వేత్తలను వెనక్కి నెట్టేస్తూ తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటున్నారు. గౌతమ్ అదానీ నేతృత్వంలోని ఆదానీ గ్రూప్ భారీ పెట్టుబడులను పెట్టేందుకు దూకుడు ప్రదర్శస్తోంది క్లీన్ ఎనర్జీ, పోర్ట్‌లు, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్ వ్యాపార విస్తరణలో ఇప్పటికే దూసుకుపోతుండగా,తన విస్తరణ ప్రణాళికపై ఆదానీ మరింత దృష్టి సారిస్తున్నారు. దాదాపు 10 బిలియన్ల డాలర్ల (82 వేల కోట్లకుపైగా) మేర విదేశీ నిధులను సమీకరించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలైన టెమాసెక్, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీతో సహా పలు పెట్టుబడిదారులతో ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు మింట్ వార్తా పత్రిక సోమవారం నివేదించింది. ఆదానీ గ్రూప్ కుటుంబ సభ్యులు టాప్ గ్రూప్ పలువురు ప్రతినిధులతో ఈ పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపినట్లు నివేదించింది.
విమానాశ్రయాలు, గ్రీన్ ఎనర్జీ, సిమెంట్, ఓడరేవులు, డాటా సెంటర్లు తదితర బిజినెస్ రంగాల్లో ఉన్న ఆదానీ.. రాబోయే దశాబ్దంలో 100 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నామని, ఇందులో అధిక భాగం న్యూ ఎనర్జీ, డాటా సెంటర్లు వంటి డిజిటల్ విభాగంలో ఈ పెట్టుబడులు ఉంటాయని గత నెలలో ఆదానీ ప్రకటించారు. అయితే పోర్ట్స్-టు-ఎనర్జీ సమ్మేళనం ఇప్పటికే దూకుడుగా ఉన్న విస్తరణ ప్రణాళికను వేగవంతం చేస్తుంది. అదానీ గ్రూప్, టాప్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు పలువురు పెట్టుబడిదారులతో చర్చలు జరిపారు. అదానీ గ్రూప్ ప్రణాళికలపై ప్రత్యక్ష అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.
అయితే భారతదేశం అతిపెద్ద ప్రైవేట్-రంగం పోర్ట్, విమానాశ్రయ ఆపరేటర్లు, సిటీ-గ్యాస్ డిస్ట్రిబ్యూటర్, బొగ్గు మైనర్‌లు అన్నీ అదానీ సామ్రాజ్యంలో భాగం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక-శక్తి ఉత్పత్తిదారుగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియాలో అపర కుభేరుడు.. అత్యంత ధనవంతుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నారు. కాగా 143 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు అదానీ. అయితే అదానీ గ్రూప్ పేరుతో మొత్తం 7 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 11 లక్షల కోట్లకు చేరింది. ఏడాదిలోనే గౌతమ్ అదానీ సంపద రెండింతలకు పైగా పెరిగింది. కార్పొరేట్ రంగంలో సడన్ స్టార్‌గా ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలు కొడుతున్న గౌతమ్ అదానీ.. ఒక్కోమెట్టు పైకెక్కుతూనే ఉన్నారు. టాప్10 ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్టులో నిలుస్తున్నారు. గౌతమ్ ఆదానీ దాదాపు అన్ని రంగాల్లో ప్రవేశించారు. ఆదానీ ఎంటర్‌ప్రైజెస్, ఆదానీ గ్రీన్ ఎనర్జీ, ఆదానీ ఫోర్ట్స్, ఆదానీ విల్మర్, ఆదానీ పవర్ లాంటి కంపెనీలు ఉండగా, ఇటీవల అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లను సైతం కొనుగోలు చేసి తయారీ రంగంలోకి అడుగు పెట్టారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ తన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు గౌతమ్ ఆదానీ.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి