AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Wilmar: లాభాలు తెచ్చిపెడుతున్న అదానీ విల్మార్.. వారంలో 30 శాతం పెరిగిన స్టాక్..

బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీ అదానీ విల్మార్(adani wilmar) షేర్లు పెరుగుతూనే ఉన్నాయి...

Adani Wilmar: లాభాలు తెచ్చిపెడుతున్న అదానీ విల్మార్.. వారంలో 30 శాతం పెరిగిన స్టాక్..
Adani Wilmar
Srinivas Chekkilla
|

Updated on: Apr 01, 2022 | 4:10 PM

Share

బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీ అదానీ విల్మార్(adani wilmar) షేర్లు పెరుగుతూనే ఉన్నాయి. విల్మార్ షేర్లు వరుసగా ఆరో సెషన్‌లో కూడా పెరిగాయి. శుక్రవారం బీఎస్‌ఈ(BSE)లో ఈ షేరు 5 శాతం పెరిగి సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ.543.35కి చేరుకుంది. అదానీ విల్మార్ షేరు ఈరోజు 1.97 శాతం లాభంతో రూ.517.50 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభ సమయంలో స్టాక్‌లో జంప్ వచ్చింది. అదానీ విల్మార్ స్టాక్ ఒక నెలలో 43 శాతానికి పైగా లాభపడింది. వారంలో 30 శాతం పెరిగింది. అదానీ విల్మార్ 8 ఫిబ్రవరి 2022న స్టాక్ మార్కె(Stock Market)లో లిస్టయింది. ఈ స్టాక్ 3 శాతం తగ్గింపుతో రూ.221 వద్ద లిస్ట్ అయింది. దీని ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.230 గా ఉంది.

అదానీ విల్మార్ స్టాక్ ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చింది. 2 నెలలలోపు పెట్టుబడిదారుల సొమ్ము రెండింతలు పెరిగింది. ఫిబ్రవరి 8న స్టాక్ రూ.221 వద్ద లిస్టైంది. శుక్రవారం రూ.543.35లకు పెరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఈ విధంగా ఇది 145 శాతం వరకు రాబడిని ఇచ్చింది. RSI, MACD, Oscillators, MAS వంటి స్టాక్ టెక్నికల్ ఇండికేటర్‌లు రోజువారీగా అప్‌సైడ్‌కు మద్దతు ఇస్తున్నాయి. అదానీ విల్మార్‌లో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ 50 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 50 శాతం వాటా సింగపూర్‌కు చెందిన విల్‌మార్ గ్రూప్‌కి ఉంది. స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన 7వ అదానీ కంపెనీ.

కంపెనీ వ్యాపారం

ఈ కంపెనీ ఫార్చ్యూన్ బ్రాండ్ పేరుతో ఎడిబుల్ ఆయిల్‌లను విక్రయిస్తోంది. ఎడిబుల్ ఆయిల్‌తో పాటు, ఈ కంపెనీ ఫార్చ్యూన్ పేరుతో బియ్యం, పిండి, చక్కెరను విక్రయిస్తుంది. ఆహారేతర ఉత్పత్తులలో, ఈ కంపెనీ సబ్బు, హ్యాండ్‌వాష్ మరియు శానిటైజర్‌లను విక్రయిస్తుంది. ఇది భారతీయ మార్కెట్లో అతిపెద్ద FMCG కంపెనీలలో ఒకటి. డిసెంబర్ త్రైమాసికంలో అదానీ విల్మార్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 66 శాతం పెరిగి రూ.211.41 కోట్లకు చేరుకుంది. దీంతో క్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభం రూ.127.39 కోట్లుగా ఉంది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.14,405.82 కోట్లకు పెరిగింది.

Note: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.

Read Also.. Gowtham Adani: 2022 అందరీకంటే ఎక్కువ డబ్బు సంపాదించిన అదానీ.. ప్రపంచంలో ఆయనది ఎన్నో స్థానమంటే..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్