AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Price: టమాట ధరతో పోటీ పడుతున్న వెల్లుల్లి.. ఒక్కసారిగా పెరిగిన రేటు

కాగా, గత ఏడాది వెల్లుల్లి హోల్‌సేల్ ధరలో చాలా చౌకగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని మండీలలో రైతుల నుంచి కిలో వెల్లుల్లిని 5 నుంచి 8 రూపాయలకు కొనుగోలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో పలువురు రైతులు వెల్లుల్లిపాయలను రోడ్డుపై పడేశారు. కానీ గత నెలలో ధరలు పెరగడంతో.. వెల్లుల్లిని రోడ్డున పడేసిన రైతులు ఈ ఏడాది ధనవంతులయ్యారు. హోల్ సేల్ ధరకు కిలో వెల్లుల్లిని రూ.150 వరకు విక్రయిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వెల్లుల్లి రిటైల్ మార్కెట్‌కు..

Garlic Price: టమాట ధరతో పోటీ పడుతున్న వెల్లుల్లి.. ఒక్కసారిగా పెరిగిన రేటు
Garlic Price
Subhash Goud
|

Updated on: Aug 13, 2023 | 10:11 AM

Share

మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. టమాట ధరతో ప్రజలు సతమతమవుతున్నారు. టమాటతో పాటు ఇతర కూరగాయాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిపాయల ధరలు కూడా రానున్న రోజుల్లో భారీగా పెరిగే అకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇక టమాటా మాదిరిగానే వెల్లుల్లి ధర ఇప్పటికీ కిలో రూ.170 దాటుతోంది. చాలా నగరాల్లో దీని ధర కిలో రూ.180కి చేరుకుంది. ప్రస్తుతం పాట్నాలో కిలో వెల్లుల్లి ధర రూ.172గా ఉంది. అదే సమయంలో కోల్‌కతాలో కిలో రూ.178కి విక్రయిస్తున్నారు. కాగా, మూడు నాలుగు నెలల క్రితం ఇది చాలా చౌకగా ఉండేది. మార్చి నెల వరకు రిటైల్ మార్కెట్‌లో కిలో 60 నుంచి 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. కానీ రుతుపవనాల రాకతో అది కూడా ఖరీదైనది.

కాగా, గత ఏడాది వెల్లుల్లి హోల్‌సేల్ ధరలో చాలా చౌకగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని మండీలలో రైతుల నుంచి కిలో వెల్లుల్లిని 5 నుంచి 8 రూపాయలకు కొనుగోలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో పలువురు రైతులు వెల్లుల్లిపాయలను రోడ్డుపై పడేశారు. కానీ గత నెలలో ధరలు పెరగడంతో.. వెల్లుల్లిని రోడ్డున పడేసిన రైతులు ఈ ఏడాది ధనవంతులయ్యారు. హోల్ సేల్ ధరకు కిలో వెల్లుల్లిని రూ.150 వరకు విక్రయిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వెల్లుల్లి రిటైల్ మార్కెట్‌కు వచ్చే సమయానికి మరింత ఖరీదైనదిగా మారింది.

వెల్లుల్లి ప్రాంతంలో 50 శాతం తగ్గింపు

దేశంలోనే అత్యధికంగా వెల్లుల్లి ఉత్పత్తి చేసే రాష్ట్రం మధ్యప్రదేశ్ అని వెల్లుల్లి వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడి వాతావరణం నేలలు వెల్లుల్లి సాగుకు అనుకూలం ఉంటాయి. నేషనల్ హార్టికల్చర్ బోర్డు గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం వెల్లుల్లి ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ వాటా 62.85 శాతం. అయితే గతేడాది సరైన ధర రాకపోవడంతో వెల్లుల్లిపాయలు పండించిన రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. చాలా మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది వెల్లుల్లి సాగును రైతులు తగ్గించారు. దీంతో వెల్లుల్లి విస్తీర్ణం దాదాపు 50 శాతం తగ్గింది. డిమాండ్ ప్రకారం.. వెల్లుల్లి మార్కెట్‌లో సరఫరా కాలేదు. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

ఇవి కూడా చదవండి

దేశం మొత్తానికి మధ్యప్రదేశ్ నుంచి వెల్లుల్లి సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి దక్షిణ భారతదేశం, మహారాష్ట్ర, ఢిల్లీ సహా అనేక రాష్ట్రాలకు వెల్లుల్లి సరఫరా చేయబడుతుంది. మధ్యప్రదేశ్‌లోని మండీల్లోనే వెల్లుల్లి ఖరీదు కావడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ధరలు పెరిగాయి. మరోవైపు గతేడాది నష్టాలు రావడంతో రైతులు వెల్లుల్లి సాగును సగానికి తగ్గించారని రట్లం జిల్లా వెల్లుల్లి రైతులు చెబుతున్నారు. అయితే ఈసారి ధరలను చూస్తే మళ్లీ విస్తీర్ణం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వెల్లుల్లి పంట వచ్చిన తర్వాత ధరలు పతనమవుతాయని భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ 6.57 శాతం వెల్లుల్లిని ఉత్పత్తి

మధ్యప్రదేశ్ తర్వాత, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో అత్యధికంగా వెల్లుల్లి సాగు అవుతుంది. ఈ మూడు రాష్ట్రాలు కలిపి 85 శాతం వెల్లుల్లిని ఉత్పత్తి చేస్తున్నాయి. రాజస్థాన్‌లో 16.81 శాతం వెల్లుల్లి ఉత్పత్తి అవుతుండగా, ఉత్తరప్రదేశ్‌లో 6.57 శాతం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నామినీ లేకపోతే ఖాతాలో డబ్బు ఎవరికి చెందుతుంది? అప్పుడేం చేయాలి?
నామినీ లేకపోతే ఖాతాలో డబ్బు ఎవరికి చెందుతుంది? అప్పుడేం చేయాలి?
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్.. 3 విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్.. 3 విమానాలకు బాంబు బెదిరింపు
ఆకలితో ఉన్న సింహం వచ్చేసింది..ఇక కటక్‌లో సౌతాఫ్రికాకు చుక్కలే
ఆకలితో ఉన్న సింహం వచ్చేసింది..ఇక కటక్‌లో సౌతాఫ్రికాకు చుక్కలే
రోజూ నీళ్లు తక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా..?తస్మాత్‌ జాగ్రత్త!
రోజూ నీళ్లు తక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా..?తస్మాత్‌ జాగ్రత్త!
న్యూ ఇయర్‌కు ముందు ఈ సంకేతాలు కనిపిస్తే మిమ్మల్ని అదృష్టం..
న్యూ ఇయర్‌కు ముందు ఈ సంకేతాలు కనిపిస్తే మిమ్మల్ని అదృష్టం..
యాషెస్ తొలి రోజుల్లో బ్యాట్స్‌మెన్‌లకు నరకం
యాషెస్ తొలి రోజుల్లో బ్యాట్స్‌మెన్‌లకు నరకం
ఆయుష్, అభిషేక్ కంటే డేంజరస్ ప్లేయర్ వచ్చేశాడ్రోయ్..
ఆయుష్, అభిషేక్ కంటే డేంజరస్ ప్లేయర్ వచ్చేశాడ్రోయ్..
ఏ మాత్రం తగ్గని బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..
ఏ మాత్రం తగ్గని బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..
ఆ కొత్త ఐసీసీ నియమం వల్లే చైనామన్ ఇంత ప్రమాదకరంగా మారాడా ?
ఆ కొత్త ఐసీసీ నియమం వల్లే చైనామన్ ఇంత ప్రమాదకరంగా మారాడా ?
ఎప్పుడూ డిమాండ్‌ ఉండే సూపర్‌ బిజినెస్‌..! నెలకు రూ.5 లక్షలు..
ఎప్పుడూ డిమాండ్‌ ఉండే సూపర్‌ బిజినెస్‌..! నెలకు రూ.5 లక్షలు..