Foreign Investors: వేల కోట్లు వెనక్కు తీసుకుంటున్న విదేశీ పెట్టుబడిదారులు.. ఆ భయాలే కారణం.. మనకి ఎంత నష్టం..?

|

May 29, 2022 | 6:13 PM

Foreign Investors: గత కొన్ని నెలలుగా భారత్ తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కు తీసుకుంటున్నారు. దీనికి ప్రధానంగా ఆ భయాలు కారణంగా నిలుస్తున్నాయి.

Foreign Investors: వేల కోట్లు వెనక్కు తీసుకుంటున్న విదేశీ పెట్టుబడిదారులు.. ఆ భయాలే కారణం.. మనకి ఎంత నష్టం..?
Stock Market
Follow us on

Foreign Investors: అమెరికాలో పెరుగుతున్న బాండ్ ఈల్డ్‌లు, పెరిగిన డాలర్ విలువ, ఫెడరల్ రిజర్వ్ మరింత దూకుడుగా రేట్లు పెంచే అవకాశాల మధ్య విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను ఉపసంహరిసంచుకుంటున్నారు. దీని కారణంగా విదేశీ మదుపరుల నుంచి అమ్మ జోరు కొనసాగుతోంది. ఈ కారణంగా ఈ నెలలో ఇప్పటి వరకు దాదాపు రూ. 39,000 కోట్ల విలువైన ఈక్విటీలను వారు అమ్మేశారు. 2022లో ఇప్పటి వరకు ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సుమారు రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. పెరిగిన క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణం, కఠినమైన ద్రవ్య విధానాల కారణంగా భారత్ లోకి ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి దేశంలోకి పెట్టుబడుల అస్థిరత కొనసాగే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.

ఇదే సమయంలో గత కొంతం కాలంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య దేశంలో పెరిగినందున.. విదేశీ మదుపరుల స్థానాన్ని దేశీయ సంస్థాగత ఇన్వేస్టర్లు, రిటైల్ పెట్టుబడి దారులు బలమైన కౌంటర్‌గా మారారు. FPIలు అమ్మకాలను అధిక స్థాయిలో కొనసాగించవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఏప్రిల్ 2022 వరకు ఏడు నెలల కాలంగా విదేశీ మదుపరులు అమ్మకందారులుగానే ఉన్నారు. మార్కెట్లలో కరెక్షన్ కారణంగా ఏప్రిల్ మొదటి వారంలో ఎఫ్‌పిఐలు నికర ఇన్వెస్టర్లుగా మారారు. ఆ కాలంలో దేశీయ ఈక్విటీల్లో రూ.7,707 కోట్లను పెట్టుబడిగా పెట్టాయి. చిన్న గ్యాప్ తరువాత వారు మళ్లీ నెట్ సెల్లర్స్ గా మారారు. అమెరికాలు ఆర్థిక మాంద్యం వస్తుందనే సంకేతాల కారణంగా విదేశీ మదుపరులు తమ సంపదను వెనక్కు తీసుకెళుతున్నారు.

ఇవి కూడా చదవండి

FPIల అమ్మకాలు ఈ నెలలోనూ కొనసాగాయి. అయితే ఈ వారం కాస్త సానుకూలంగానే ముగిసిందని చెప్పుకోవాలి. గ్లోబల్ మార్కెట్లు US GDP అంచనాలపై స్పందించటం కూడా దీనికి మరో కారణంగా ఉంది. ఈ కాలంలో కేవలం ఈక్విటీల నుంచి మాత్రమే కాక డెట్ మార్కెట్ నుంచి కూడా వారు దాదాపు రూ.6,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించున్నారు. కేవలం భారత్ లోనే కాకుండా.. తైవాన్, సౌత్ కొరియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌తో సహా ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు మే నెలలో తమ పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.