Amazon Pay: మీ అమెజాన్‌ పేలో ఉన్న డబ్బులను అకౌంట్‌లోకి ఎలా పంపించుకోవాలో తెలుసా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే సరి..

|

Nov 13, 2022 | 7:37 PM

ప్రస్తుతం ఈ వ్యాలెట్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్‌లు, ఇంటర్‌నెట్‌ వినియోగం పెరగడంతో లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని సంస్థలు ఈ వ్యాలెట్స్‌ను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ సైట్‌...

Amazon Pay: మీ అమెజాన్‌ పేలో ఉన్న డబ్బులను అకౌంట్‌లోకి ఎలా పంపించుకోవాలో తెలుసా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే సరి..
Amazon Pay
Follow us on

ప్రస్తుతం ఈ వ్యాలెట్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్‌లు, ఇంటర్‌నెట్‌ వినియోగం పెరగడంతో లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని సంస్థలు ఈ వ్యాలెట్స్‌ను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ సైట్‌ అమెజాన్‌ అమెజాన్‌ పే పేరుతో వ్యాలెట్‌ను తీసుకొచ్చింది. దీంతో అమెజాన్‌ యాప్‌లో కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన రిఫండ్స్‌, క్యాష్‌బ్యాక్‌లు అమెజాన్‌ పే బ్యాలెన్స్‌లోకి చేరుతాయనే విషయం తెలిసిందే. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ ద్వారా మళ్లీ అమెజాన్‌లో వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ బ్యాలెన్స్‌ను మీ ఖాతాలోకి కూడా పంపుకోవచ్చని మీకు తెలుసా.? కొన్ని సింపుల్ స్టెప్స్‌ ద్వారా అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ను మీ ఖాతాలోకి పంపించుకోవచ్చు. అయితే.. ఇందుకోసం మీరు కేవైసీని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

* ముందుగా అమెజాన్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* అనంతరం అమెజాన్‌ పే విభాగంలో వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

* తర్వాత సెండ్ మనీపై క్లిక్ చేసి, ‘టు బ్యాంక్’ ఎంపికను ఎంచుకోండి.

* మీరు డబ్బు పంపాలనుకుంటున్న బ్యాంక్‌ ఖాతా ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, అకౌంట్‌ నెంబర్‌, అకౌంట్‌ పేరును ఎంటర్‌ చేసి పే నౌ పై క్లిక్‌ చేయాలి.

* అనంతరం అమౌంట్‌ను ఎంటర్‌ చేయాలి. ఎందులో నుంచి అమౌంట్‌ పంపించాలనుకుంటున్న ఆప్షన్స్‌లో Amazon Pay బ్యాలెన్స్‌పై క్లిక్ చేయాలి.

* చివరిగా కంటిన్యూ పై క్లిక్‌ చేస్తే అమెజాన్‌ పే నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది.

కేవైసీ ఎలా చేసుకోవాలంటే..

* కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలంటే ముందుగా Amazon యాప్‌లోకి వెళ్లి KYC విభాగానికి సెలక్ట్‌ చేసుకోవాలి.

* అనంతరం మీ సెల్ఫీ ఫొటోను అప్‌డేట్‌ చేయాలి.

* అనంతరం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

* ఆధార్‌ కార్డుతో లింక్‌ చేసిన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.

* అనంతరం అమెజాన్‌ ఏజెంట్‌ వీడియో కాల్ ద్వారా ధృవీకరణ పూర్తి చేస్తారు. దీంతో మీ కేవైసీ పూర్తయినట్లు మెసేజ్‌ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..