ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ వాడకంలో సామాన్య ప్రజలతో ప్రైవేట్ వ్యాపార రంగాలు.. ప్రభుత్వాలు కూడా చేరిపోయాయి. ఇప్పటికే బ్యాంకులకు సంబంధించిన పనుల దగ్గర్నుంచి.. చదువుల వరుక ప్రతి ఒక్కదానికి స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఇక టెక్నాలజీ వాడకంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం సంస్థలు కూడా చేరిపోయాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలనుకున్నా.. ఇతర గ్యాస్ సిలిండర్ వివరాలను సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలోనే సదరు గ్యాస్ సంస్థలు.. తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు నియమనిబంధనలు షేర్ నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ ఖాళీ కాగానే వెంటనే మీ దగ్గరున్న స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంట్లో ఉండే బుక్ చేసుకోవచ్చు. ఈ విషయం అందరికి తెలిసినా.. ఎలా బుక్ చేయాలనేది మాత్రం కొందరికి తెలియదు. మరి గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకుందామా.
మీరు ఇండినే గ్యాస్ వినియోగదారులైతే మీరు ఈ విషయం తప్పకకుండా తెలుసుకోవాల్సిందే. ఇండినే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం ముందుగా iocl.com లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) యొక్క అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలి. ఇటీవల ఎల్పీజీ సిలిండర్ ను రిఫీల్ చేయడానికి స్మార్ట్ బుకింగ్ పద్ధతుల గురించి ఐఓసీఎల్ (IOCl) ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.
గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవాల్సిన పద్ధతులు..
1. 7588888824 ద్వారా ఎల్పీజీ సిలిండర్ రిక్వెస్ట్ పెట్టవచ్చు.
2. లేదా 8454955555 నంబర్‌కు మిస్డ్ కాల్ కూడా ఇవ్వవచ్చు
3. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా LPG సిలిండర్ రీఫిల్ బుకింగ్ కూడా చేయవచ్చు.
4. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఇండినే LPG సిలిండర్ రీఫిల్ కోసం బుక్ చేసుకోవచ్చు.
5. LPG సిలిండర్ రీఫిల్ బుకింగ్ కూడా cx.indianoil.in అనే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చేయవచ్చు.
IOCL వెబ్‌సైట్ ప్రకారం, జూలై 1, 2021 నుండి 14.2 కేజీల సిలిండర్ కోసం మెట్రో నగరాల్లో ఇండినే సబ్సిడీ లేని ధరలు క్రింది విధంగా ఉన్నాయి..
1) ఢిల్లీ – రూ. 834.50
2) కోల్‌కతా – రూ. 861
3) ముంబై – రూ. 834.50
4. చెన్నై – రూ. 850.50
జూలై 1, 2021 నుండి 19 కిలోల సిలిండర్ కోసం మెట్రో నగరాల్లో ఇందనే సబ్సిడీ లేని ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
1) ఢిల్లీ – రూ 1550
2) కోల్‌కతా – రూ 1629
3) ముంబై – రూ .1507
4) చెన్నై – రూ 1687
మరిన్ని వివరాల కోసం, iocl.com లో అధికారిక IOCL వెబ్‌సైట్‌కి లాగిన్ అయి చూడవచ్చు.