Personal Loan: ఈ టిప్స్ పాటిస్తే మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ అస్సలు రిజక్ట్ అవ్వదు.. అవేంటో తెలుసుకోండి..
Personal Loan: ఆర్థిక అవసరాలు అందరికీ ఉంటాయి. ఇందుకోసం బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం పరిపాటే. బయటి వ్యక్తుల దగ్గర అప్పుడు తీసుకుంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకుల్లోనే లోన్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ...
Personal Loan: ఆర్థిక అవసరాలు అందరికీ ఉంటాయి. ఇందుకోసం బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం పరిపాటే. బయటి వ్యక్తుల దగ్గర అప్పుడు తీసుకుంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకుల్లోనే లోన్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ ఎలాంటి గ్యారంటీ లేకుండా వచ్చేది పర్సనల్ ఒకటే. సాధారణంగా బ్యాంకులు కొన్ని అంశాలను ప్రాతిపదికన తీసుకొని వ్యక్తిగత రుణాలు అందిస్తుంటాయి. పర్సనల్‌లోన్‌కు అప్లై చేసుకొని బ్యాంకులు ఆ లోన్‌ను రిజక్ట్ చేసిన సందర్భాలు ఉండే ఉంటాయి. అయితే మీరు దరఖాస్తు చేసుకున్న లోన్ ఎట్టి పరిస్థితుల్లో రిజక్ట్ కాకూడదంటే కొన్ని టిప్స్ కచ్చితంగా పాటించాలి. అవేంటంటే…
క్రెడిట్ స్కోర్ బాగుండేలా చూసుకోండి..
బ్యాంకులు ఎలాంటి పుచికత్తు లేకుండా మీకు లోన్‌ను ఇచ్చేది మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే. అంటే గతంలో మీరు తీసుకున్న లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్‌ల బిల్స్‌ను ఎప్పటికప్పుడు రీపే చేస్తుండాలి. దీనిద్వారా క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు. సాధారణంగా ఏ లోన్ అయినా రిజక్ట్ కాకూడదంటే క్రెడిట్ స్కోర్ 750 ఆపై ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే లోన్ రిజక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్‌పై దృష్టిసారిస్తుండాలి. పలు వెబ్‌సైట్‌లు ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకునే అవకాశాన్ని కల్పించాయి.
ఎక్కువ ఈఎమ్‌ఐలు ఎంచుకోండి..
చాలా మంది తీసుకున్న రుణాన్ని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో తక్కువ ఈఎమ్‌ఐలు ఎంచుకుంటారు. అయితే అలా కాకుండా ఎక్కువ ఈఎమ్‌ఐ ఆప్షన్స్‌ను ఎంచుకోవాలి. దీనివల్ల సులభంగా వాయిదాలను చెల్లించుకోవడానికి వీలు లభిస్తుంది. ఎక్కువ ఈఎమ్‌ఐలు ఉన్నా కాలక్రమేణా మీరు చెల్లించే మొత్తం తక్కువగా ఉంటుంది. ఉదారహణకు 2020లో మీ జీతం రూ. 20,000గా, మీ ఈఎమ్‌ఐ రూ. 5,000గా ఉందనుకుందాం. అదే 2030 నాటికి మీ జీతం కనీసం రూ. 30,000 అవుతుతుంది కానీ ఈఎమ్‌ఐ రూ. 5,000గానే ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ ఈఎమ్‌ఐలను ఎంచుకోవడం ద్వారా లోన్ అప్రూవల్ అయ్యే అవకాశలు కూడా పెరుగుతాయి.
ఒకేసారి ఆ పని చేయొద్దు..
కొంత మంది వ్యక్తిగత రుణాల కోసం ఒకే సమయంలో ఎక్కువ బ్యాంకులను సంప్రదిస్తుంటారు. ఇలా చేయడం వల్ల రుణం పొందే అవకాశం తగ్గుతుంది. ఒకసారి మీ లోన్ అప్లికేషన్ రిజక్ట్ అయితే వెంటనే మరో బ్యాంకులో అప్లై చేసుకోకూడదు. ఇలా చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. పదే పదే ఎక్కువ వెండర్స్ దగ్గర రుణాల కోసం అప్లై చేస్తే అది సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..