New Jobs: నిరుద్యోగ యువతకు అలెర్ట్.. ఆ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు

|

Nov 25, 2024 | 6:10 PM

దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం రోజురోజుకీ విస్తరిస్తోంది. రానున్న రెండేళ్లో ఈ రంగంలో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం ఉందని తాజా నివేదికలో వెల్లడైంది. టీమ్‌లీజ్‌ ఎడ్యుటెక్‌ సంస్థ విడుదల చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి..

New Jobs: నిరుద్యోగ యువతకు అలెర్ట్.. ఆ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు
Jobs
Follow us on

దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రెట్టింపు కానుంది. టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025-26 నాటికి ఈ రంగం రెట్టింపు కానుందని తేలింది. ఈ కారణంగా ఫాస్ట్‌ మూవింగ్ కన్జ్యూమర్‌ గూడ్స్‌ రంగంలో ఉద్యోగాలు భారీగా పెరగనున్నట్లు నివేదికలో వెల్లడైంది.

ముఖ్యంగా ఫ్రెషర్స్‌ నియామకం భారీగా పెరగనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ రంగాల్లో ఈ ఏడాది మొదటి భాగంగా ఉద్యోగాల కల్ప 27 శాతానికి పెరగగా, రెండో భాగంలో 32 శాతానికి పెరిగింది. ఫుడ్‌ ప్రాసెసింగ్ పరిశ్రమ ద్వారా 2019-20లో 263 బిలియన్‌ డాలర్ల ఆదాయం రాగా, 2025-26 నాటికి ఇది ఏకంగా 535 బిలియన్‌ డాలర్లకు పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఏడాదికి 12.6 శాతం వృద్ధిరేటు నమదైనట్లు ఈ నివేదికలో వెల్లడైంది.

ఈ వృద్ధీ గ్రామీణ, సెమీ అర్బన్‌ మార్కెట్లోకి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చొచ్చుకుపోయేలా చసింది. డైరీ, ఆర్‌టీఈ ఫుడ్‌, స్నాక్స్‌, ఫ్రోజేన్‌ మాంసం వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించినట్లు నివేదిక చెబతోంది. ముఖ్యంగా సరఫరా గొలుసుతో పాటు మార్కెట్ పరిశోధన రంగాలలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని నివేదిక హైలైట్ చేసింది. టీమ్‌లీజన్‌ ఎడ్‌టెక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను రూజ్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘ఫాస్ట్‌మూవింగ్ కన్జ్యూమర్‌ గూడ్స్‌లో తాజా ప్రతిభకు డిమాండ్ పెరగడం గ్రామీణ, సెమీ అర్బన్‌ మార్కెట్లో లోతైన విస్తరణకు కారణంగా చెప్పొచ్చు. ఇది భారతదేశ ఫుడ్‌ ప్రాసెసింగ్ పరిశ్రమ వేగవంతమైన వృద్ధికి ఆజ్యం పోసింది’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఫాస్ట్‌మూవింగ్ కన్జ్యూమర్‌ గూడ్స్‌ కంపెనీలు నైపుణ్యం కలిగిన ప్రెషర్‌లను నియమించుకోవడంపై దృష్టిసారించాయని నివేదిలో హైలెట్‌ చేశారు. ఫుడ్ ఇంజనీర్లు బెంగళూరులో 41 శాతం, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లు ఢిల్లీలో 39 శాతం, హైదరాబాద్‌లో సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ చైన్ పొజిషన్‌లు 37 శాతం, బ్రాండ్ మేనేజ్‌మెంట్ ట్రైనీలు బెంగళూరులో 34 శాతం మందిని నియమించుకుంటున్నారు. సర్వేలో భాగంగా 526 చిన్న, మధ్యతరహా కంపెనీలను ఎంచుకున్నారు. టైర్‌1, టైర్‌2 నగరగాలతో పాటు 14 ప్రాంతాలను పరిగణలోకి తీసుకున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..