
ఫ్లిప్‌కార్ట్ మళ్ళీ కొత్త సేల్ తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 8వరకు ఫ్రీడమ్ సేల్ నిర్వహించిన ఫ్లిప్ కార్ట్.. ఇప్పుడు మరో సేల్ ప్రారంభించడం గమనార్హం. ఇవాళ్టి నుంచి ఈ నెల 17వరకు ఇండిపెండెన్స్ సేల్ జరగనుంది. ఈ సేల్‌లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్, శామ్‌సంగ్ ఫోన్‌లను సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు విక్రయించే స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్‌లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై డబ్బు ఆదా చేసుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుంది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సేల్‌లో 78 ఫ్రీడమ్ డీల్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా సూపర్ కాయిన్‌ల ద్వారా కొనుగోలుపై అదనంగా 10 శాతం తగ్గింపు పొందవచ్చు.
ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రత్యేక పేజీని సిద్ధం చేసింది. ఈ సేల్ సమయంలో కస్టమర్లు 78 ఫ్రీడమ్ డీల్స్, ఎక్స్‌ఛేంజ్ అవర్ డీల్స్, జాక్‌పాట్ డీల్స్, బడ్జెట్ డీల్స్, బాస్కెట్ డీల్స్, రష్ అవర్స్ డీల్స్ వంటివి ఉంటాయి. ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ కెనరా బ్యాంక్‌తో చేతులు కలిపింది. అంటే మీరు కెనరా బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే మీకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ ప్రయోజనం లభిస్తుంది. బ్యాంక్ కార్డ్‌లతో పాటు మీరు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. ఇది మాత్రమే కాదు.. సేల్ సమయంలో కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యే ఈ సేల్‌లో.. పాత ఐఫోన్ మోడళ్లను దాదాపు సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీరు ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అదే సమయంలో ఐఫోన్ 15, ఐఫోన్ 16లపై కూడా మంచి ఆఫర్లు నడుస్తున్నాయి. మీరు శామ్‌సంగ్ గెలాక్సీ S23, గెలాక్సీ S24 సిరీస్‌ల నుండి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను సగం ధరకే ఇంటికి తీసుకురావచ్చు. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన గెలాక్సీ S25 సిరీస్‌లోని అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్‌లో కస్టమర్ల కోసం రూ. 17,999కి లాంచ్ అవగ్గా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 15,999కే అందుబాటులో ఉంది. కస్టమర్లు మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఐఫోన్ 16, శామ్‌సంగ్ గెలాక్సీ S24, శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE, రియల్‌మీ P3 5G, వివో T4 5G, నథింగ్ ఫోన్ 2 ప్రోలు బంపర్ డిస్కౌంట్‌లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..