ఈ 10 ఫైనాన్స్‌ కంపెనీలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి.. ఎంతంటే..?

|

Dec 11, 2021 | 10:18 PM

Fixed Deposit: కరోనా ముప్పు మళ్లీ ముందుకొచ్చింది. ఈసారి ఓమిక్రాన్ వేరియంట్ ప్రజలను భయపెడుతోంది. చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు.

ఈ 10 ఫైనాన్స్‌ కంపెనీలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి.. ఎంతంటే..?
Money
Follow us on

Fixed Deposit: కరోనా ముప్పు మళ్లీ ముందుకొచ్చింది. ఈసారి ఓమిక్రాన్ వేరియంట్ ప్రజలను భయపెడుతోంది. చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో అలాంటి అవకాశం లేదు కానీ ప్రతికూల పరిస్థితులకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. బ్యాడ్‌ టైంలో బయటపడేందుకు ఎప్పుడు బ్యాంకులో కొంత డిపాజిట్ చేసి ఉండాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్ దీనికి బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) లేదా రికరింగ్ డిపాజిట్ (RD) ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఉద్భవించాయి. అందుకే మీరు తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని పొందగలిగే FDల కోసం ఎల్లప్పుడూ వెతకాలి. ప్రధానంగా ఫైనాన్స్ కంపెనీలు 7.48 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నాయి. అలాంటి 10 కంపెనీల గురించి తెలుసుకుందాం.

ఇందులో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ 12-60 నెలల FDపై 7.48 శాతం వడ్డీని చెల్లిస్తుంది. దీనికి MAA ప్లస్ హోదా వచ్చింది. రెండో స్థానంలో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ 12-60 నెలల FDపై 7.48 శాతం రాబడిని ఇస్తోంది. దీని తర్వాత బజాజ్‌ ఫైనాన్స్ పేరు ఉంది. ఇది 12-60 నెలల FDపై 6.80 శాతం వడ్డీని అందిస్తుంది. బజాజ్ ఫైనాన్స్ FAAA రేటింగ్‌ను కలిగి ఉంది. తదుపరి PNB హౌసింగ్ ఫైనాన్స్ పేరు వస్తుంది. ఇది 12-120 నెలల కాల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.70 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది CRISIL నుంచి FAA+ రేటింగ్‌ను పొందింది.

LIC ఫైనాన్స్ వడ్డీ రేటు
HDFC కూడా FD పథకాన్ని అమలు చేస్తుంది. HDFC 33-99 నెలల కాలవ్యవధికి FDలపై 6.70 శాతం వడ్డీని అందిస్తోంది. దీని రేటింగ్ కూడా FAAA. దీని తర్వాత ICICI హోమ్ ఫైనాన్స్ పేరు ఉంది. ఇది 12-120 నెలల FD పథకంపై 6.65 శాతం వడ్డీని ఇస్తుంది. మహీంద్రా ఫైనాన్స్ 12-60 నెలల FDలపై 6.45 శాతం రాబడిని అందిస్తోంది. సుందరం హోమ్ ఫైనాన్స్ 12-60 నెలల FDలపై 5.80 శాతం వడ్డీని ఇస్తోంది. అదేవిధంగా సుందరం ఫైనాన్స్ 12-36 నెలల FDలపై 5.80 శాతం వడ్డీని ఇస్తోంది. చివరగా LIC హౌసింగ్ ఫైనాన్స్ వస్తుంది. ఇది 12-60 నెలల FD పై 5.75 శాతం వడ్డీని ఇస్తుంది.

స్టేట్ బ్యాంక్
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7-45 రోజుల FDలపై 2.90-3.40 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. 46-179 రోజుల FDలపై 3.90-4.40 శాతం, 180-210 రోజుల FDలపై 4.40-4.90 శాతం, 211-1 సంవత్సరాల FDలపై 4.40-4.90 శాతం, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ FDలపై 5 -5.50 శాతం, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ FDలపై 5.10-5.60 శాతం, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ FDలపై 5.30-5.80 శాతం, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల FDలపై 5.40-6.20 శాతం చెల్లిస్తోంది.

LIC Scholarship 2021: విద్యార్థులకు శుభవార్త.. LIC స్కాలర్‌ షిప్‌కి అప్లై చేయండి.. ఏడాదికి రూ.20,000 పొందండి

ప్రపంచంలో ఒంటరి ఇల్లు.. 100 ఏళ్లుగా ఖాళీగా ఉంటుంది.. కారణమేంటో తెలుసా..?

ప్రయాణికుల కోసం అక్కడి రైల్వే స్టేషన్‌లో ఆ సేవలు ప్రారంభం.. సమయం ఆదా.. ఛార్జీలు తక్కువే..