
భారతదేశంలో ఇటీవల కాలంలో ఆడపిల్లలు అన్నింటా పోటీపడుతున్నారు. అయితే ఇప్పటికీ గ్రామాల్లో ఆడపిల్ల అంటే చిన్నచూపు అలానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల ఆర్థిక భరోసా కల్పించేలా ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు పొదుపు చేసేలా సుకన్య సమృద్ధి యోజన పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. పదేళ్లలోపు ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో పెట్టుబడికి ఇష్టపడుతున్నారు. సుకన్య సమృద్ధి యోజన సాపేక్షంగా అధిక వడ్డీ రేటు అందిస్తుంది. ముఖ్యంగా ఆడబిడ్డ విద్య, వివాహం కోసం ఉపయోగించేలా పెద్ద మొత్తంలో సొమ్ము పొదుపు చేయవచ్చుు. ఈ నేపథ్యంలో సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా కలిగే లాభాలతో పాటు ఆ ఖాతా తీసుకోవాలంటే అవసరమైన పత్రాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద సుకన్య సమృద్ధి యోజన పథకంపై వచ్చే రాబడిపౌ పన్ను రహిత మెచ్యూరిటీ, మినహాయింపును పొదవచ్చు. ఏ బ్యాంకులో లేదా పోస్టాఫీసు శాఖలో ఈ ఖాతాను తెరవవచ్చు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు మాత్రమే తెరవగలరు. ఒక కుటుంబానికి గరిష్టంగా రెండు ఖాతాలు అనుమతిస్తారు. రెండోసారి జన్మించిన కవలలకు మినహాయింపు ఉంటుంది. మూడో ఖాతా కోసం అనుమతి ఉంటుంది. ఈ పథకంలో ఏడాదికి కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలతో ఎస్ఎస్‌వై ఖాతాకు డిపాజిట్లు చేయవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాలు లేదా అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహ సమయంలో ఖాతా మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..