Finance Tips: నెలకు రూ.30 వేల జీతమా..? హోమ్ లోన్, కారు లోన్ రెండింటినీ ఎలా మేనేజ్ చేయాలి?
Finance Tips: మీకు స్థిరమైన ఉద్యోగం ఉండి, ఇతర పెద్ద అప్పులు ఏవీ లేకుండా, మీ నెలవారీ ఖర్చులు అదుపులో ఉంటే సరైన ప్రణాళికతో మీ గృహ రుణం, కారు రుణం రెండింటి EMIలను నిర్వహించుకోవచ్చు. అయితే మీకు ఇప్పటికే రుణాలు ఉన్నా..

Finance Tips: ఈ రోజుల్లో చాలా మందికి ఇల్లు, కారు కొనడం ఒక కల. కానీ మీ నెల జీతం కేవలం రూ.30,000 మాత్రమే అయితే రుణం పొందడం లేదా దాన్ని తిరిగి చెల్లించడం అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. కేవలం ఇంత ఆదాయంతో ఇంటి, కారు రుణాల EMIలను రెండింటినీ చెల్లించగలరా అని మీరు ఆలోచిస్తుంటే ఈ విషయాలు తెలుసుకోండి. అప్పుడే మీకు సులభంగా చెల్లించగలను అనే నమ్మకం వస్తుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: రికార్డు స్థాయిలో దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
బ్యాంకు రుణం ఎప్పుడు మంజూరు చేస్తుంది?
రుణం మంజూరు చేసేటప్పుడు మొత్తం EMI మీ నెలసరి జీతంలో 40% నుండి 50% మించకుండా ఉండేలా బ్యాంకు నిర్ధారించుకుంటుంది. దీనిని FOIR అంటారు. మీ జీతం రూ.30,000 అయితే 40% వద్ద గరిష్ట EMI రూ.12,000, 50% వద్ద గరిష్ట EMI రూ.15,000 ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు మీ మొత్తం EMI రూ.12,000 – రూ.15,000 మధ్య ఉండాలని భావిస్తాయి.
ఉదాహరణకు మీ గృహ రుణ EMI నెలకు రూ.9,000, మీ కారు రుణ EMI నెలకు రూ.4,000 అయితే, మీ మొత్తం EMI నెలకు రూ.13,000 అవుతుంది. ఇది మీ రూ.30,000 జీతంలో సుమారుగా 43% ఉంటుంది. దీని ఆధారంగా మీరు బ్యాంకు నుండి రుణం పొందగలుగుతారు. అయితే, నిర్ణయం తీసుకునే ముందు బ్యాంకు మీ క్రెడిట్ ప్రొఫైల్, గత రుణ వివరాలు, ఖర్చులను సమీక్షిస్తుంది.
ఇది కూడా చదవండి: Indian Railways: ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!
జీతంలో ఎంత మిగులుతుంది?
మీ జీతం రూ.30,000, మీ ఈఎంఐ రూ.13,000 అయితే మీకు ప్రతి నెలా సుమారు రూ.17,000 మిగులుతుంది. ఈ రూ.17,000 నుండి మీరు మీ ఇంటి ఖర్చులు, విద్యుత్, నీటి బిల్లులు, వైద్య ఖర్చులు భరించాలి. ఇంకా పెట్రోల్ లేదా CNG కోసం కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గర ఏమీ మిగలకపోవచ్చు.
ఏ విషయాలను గుర్తుంచుకోవాలి?
- మొత్తం EMI మీ ఆదాయంలో 40% మించకూడదు.
- అత్యవసర నిధిని తప్పకుండా ఏర్పాటు చేసుకోండి.
- మంచి క్రెడిట్ స్కోర్‌ను కొనసాగించండి.
- మీరు ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లిస్తే, EMI తక్కువగా ఉంటుంది.
30,000 జీతంతో రెండు రుణాలూ తీసుకోవడం సరైనదేనా?
మీకు స్థిరమైన ఉద్యోగం ఉండి, ఇతర పెద్ద అప్పులు ఏవీ లేకుండా, మీ నెలవారీ ఖర్చులు అదుపులో ఉంటే సరైన ప్రణాళికతో మీ గృహ రుణం, కారు రుణం రెండింటి EMIలను నిర్వహించుకోవచ్చు. అయితే మీకు ఇప్పటికే రుణాలు ఉన్నా లేదా మీ ఖర్చులు ఎక్కువగా ఉన్నా, రెండు రుణాలనూ ఒకేసారి తీసుకునే ముందు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం ముఖ్యం.
ఇది కూడా చదవండి: Bank FD: మీరు ఈ బ్యాంకులో రూ.5 లక్షల ఎఫ్‌డీ చేస్తే 60 నెలల్లో ఎంత ఆదాయం వస్తుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




