AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: రికార్డు స్థాయిలో దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!

Gold, Silver Prices: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో, జూన్ 1 నుండి బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.15,000 మేర పడిపోయింది. ఇది 9.73% తగ్గుదల. అదేవిధంగా వెండి..

Gold Price Today: రికార్డు స్థాయిలో దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
Gold, Silver Rates: బంగారం కొనుగోలు చేయాలనే వారికి ఇది పెద్ద గుడ్‌న్యూస్‌. బంగారం ధర మరింత దిగజారుతోంది. రోజురోజుకు ధర అమాంతంగా పడిపోతోంది. బులియన్ మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం ధరలు భారీగా తగ్గగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకులు, అమెరికా డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం.
Subhash Goud
|

Updated on: Jun 28, 2026 | 6:34 AM

Share

Gold, Silver Prices Today: గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతూ వచ్చాయి. కానీ 2026 జూన్‌లో బంగారం, వెండి విలువైన లోహాల ధరలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో, జూన్ 1 నుండి బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.15,000 మేర పడిపోయింది. ఇది 9.73% తగ్గుదల. అదేవిధంగా వెండి ధర కిలోకు దాదాపు రూ.45,000 మేర తగ్గింది. అయితే ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. జూన్‌ 28న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. ముఖ్యంగా ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఇది కూడా చదవండి: Indian Railways: ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!

  1. హైదరాబాద్‌ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,950 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,950 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీ- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,100 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,100 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,950 వద్ద కొనసాగుతోంది.
  5. బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,950 వద్ద కొనసాగుతోంది.
  6. కోల్‌కతా -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,950 వద్ద కొనసాగుతోంది.
  7. చెన్నై -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,700 వద్ద కొనసాగుతోంది.
  8. ఇక వెండి విషయానికొస్తే ఈ లోహం కూడా రోజురోజుకు భారీ స్థాయిలో దిగి వస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చదవండి: Bank FD: మీరు ఈ బ్యాంకులో రూ.5 లక్షల ఎఫ్‌డీ చేస్తే 60 నెలల్లో ఎంత ఆదాయం వస్తుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us