Fertiliser Price Reduced: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఎరువుల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం

|

Feb 21, 2023 | 2:27 PM

భారతదేశంలోని అతిపెద్ద ఎరువుల తయారీ సంస్థ ఇఫ్కో (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్) రైతులకు గొప్ప శుభవార్త అందించింది. ఎరువుల ధరలను తగ్గించాలని నిర్ణయించింది..

Fertiliser Price Reduced: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఎరువుల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం
Fertiliser
Follow us on

భారతదేశంలోని అతిపెద్ద ఎరువుల తయారీ సంస్థ ఇఫ్కో (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్) రైతులకు గొప్ప శుభవార్త అందించింది. ఎరువుల ధరలను తగ్గించాలని నిర్ణయించింది. కంపెనీ తన ఉత్పత్తుల ధరలను 14 శాతం వరకు తగ్గించబోతోంది. హిందూస్థాన్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ విషయంపై సమాచారం ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత, వ్యవసాయానికి ఎరువుల ధర పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ అధికారి తెలిపారు.

ఈ నిర్ణయంతో పేద రైతులు అత్యధికంగా లబ్ధి పొందుతారని ఇఫ్కో అధికారి చెబుతున్నారు. దీంతో వాటి సాగు ఖర్చు తగ్గుతుంది. ఎరువుల తయారీకి ఇప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీంతో ఎరువుల ధర తగ్గుతోందని, దీంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. దీని వల్ల దేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

దేశంలో ఆహార భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం రైతులకు ఎరువుల వాడకంపై సబ్సిడీని ఇస్తుంది. ప్రభుత్వం అనేక ఎరువుల కంపెనీలకు 80 శాతం వరకు సబ్సిడీని అందజేస్తుంది. దాని వల్ల రైతులు దాని ప్రయోజనం పొందుతారు. ముఖ్యమైన ఎరువులైన ఎన్‌పీకేఎస్‌ ధర రూ.200 నుంచి రూ.1200కి తగ్గిందని ఇఫ్కో అధికారి తెలిపారు. దీంతో ఖరీఫ్‌ సీజన్‌లో సాగు ఖర్చు తగ్గడంతో రైతులకు మేలు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

2023 బడ్జెట్‌లో ఎరువులపై సబ్సిడీలో పెద్ద కోత పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయించారు. ఈసారి ప్రభుత్వం ఎరువుల సబ్సిడీకి మొత్తం రూ.1.75 లక్షల కోట్లు కేటాయించింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 22 శాతం తక్కువ. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆహార సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులకు గిట్టుబాటు ధరకే ఎరువులు అందుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి