FD Rates Hike: భారీగా పెరుగుతున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు.. ఇప్పటికే ఉన్న ఎఫ్‌డీలను ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

|

Feb 16, 2023 | 4:35 PM

చాలా బ్యాంకులు ఎఫ్‌డీలపై 7 నుంచి 8 శాతం వరకూ వడ్డీ అందిస్తున్నాయి. అయితే మరికొన్ని ఫైనాన్స్ బ్యాంకులైతే 9 శాతం వరకూ వడ్డీను అందిస్తున్నాయి. అయితే ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీలపై అధిక వడ్డీ పొందే అవకాశం ఉంది.

FD Rates Hike: భారీగా పెరుగుతున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు.. ఇప్పటికే ఉన్న ఎఫ్‌డీలను ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
Fixed Deposit
Follow us on

పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్నిఅదపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేట్లను పెంచుతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా టెర్మ్ డిపాజిట్లుగా పిలిచే ఎఫ్‌డీలపై బ్యాంకులు అదనంగా వడ్డీ అందిస్తున్నాయి. చాలా బ్యాంకులు ఎఫ్‌డీలపై 7 నుంచి 8 శాతం వరకూ వడ్డీ అందిస్తున్నాయి. అయితే మరికొన్ని ఫైనాన్స్ బ్యాంకులైతే 9 శాతం వరకూ వడ్డీను అందిస్తున్నాయి. అయితే ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీలపై అధిక వడ్డీ పొందే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎఫ్‌డీలు వేసిన వారు తమ డిపాజిట్లను ఉపసంహరించుకుని నూతన వడ్డీ రేట్లతో మళ్లీ ఎఫ్‌డీలు వేయాలని అనుకుంటారు. అయితే ఇలాంటి చర్యలపై ఆర్థిక రంగ నిపుణులు ఏం చెబుతున్నారో? ఓ సారి చూద్దాం.

ఎఫ్‌డీలను మెచ్యూరిటీ అవ్వకముందే విత్‌డ్రా చేసుకుంటే బ్యాంకులు ఫెనాల్టీలు విధిస్తాయి. అయితే ఆ ఫెనాల్టీ వడ్డీ రేటులో 0.5 శాతం నుంచి 3 శాతం వరకూ ఉంటుంది. ఎస్‌బీఐ రూ.5 లక్షల డిపాజిట్ల వరకూ 0.5 శాతం, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు 1 శాతం వడ్డీను ఫెనాల్టీగా విధిస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్‌డీలను విత్‌డ్రా చేసే ముందు ఎంత సమయంలో మెచ్యూర్ అవుతున్నాయో గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎఫ్‌డీ ఇంకో ఆరు నెలల సమయంలో మెచ్యూర్ అయితే విత్ డ్రా చేయడం ఉత్తమ ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు. ఓ అంచనా ప్రకారం మీరు 2 సంవత్సరాల క్రితం మీరు 7% చొప్పున 1 లక్ష ఎఫ్‌డీని తెరిచారని అనుకుందాం. ఒక సంవత్సరం తర్వాత మీరు ఎఫ్‌డీని విత్‌డ్రా చేయాలని నిర్ణయించుకుంటే బ్యాంకు వడ్డీ రేటు ఆరు శాతమే చెల్లిస్తుంది. రాబోయే నెలల్లో, ఒకటి లేదా రెండు త్రైమాసికాలలో మెచ్యూర్ అవుతున్న ఎఫ్‌ఢీలతో, మీరు పెనాల్టీని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వాటిని విత్ డ్రా చేయడం ఉత్తమమైన పని కాదు. 

మీరు డిపాజిట్ చేసిన ఎఫ్‌డీ ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితిలో ముగుస్తుంటే మాత్రం వాటిని విత్ డ్రా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే బ్యాంకులు విధించే ఫెనాల్టీ కంటే ఎక్కువగానే కస్టమర్లు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ఎఫ్‌డీపై వర్తించే పన్ను మీ టెర్మ్ డిపాజిట్ 30 శాతం శ్లాబులోకి వస్తే అప్పుడు మీరు గణనీయమైన మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మొత్తం మీద నిపుణులు మాత్రం ఆరు నెలల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలను విత్ డ్రా చేయకుండా సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలను విత్ డ్రా చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి