Facebook: ఫేస్‎బుక్ పేరు మారుతుందా.. అక్టోబర్ 28న ఏం జరగబోతుంది..

|

Oct 20, 2021 | 8:52 AM

ఫేస్‎బుక్ సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్‎కు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఖాతాదారులు ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో చాలా మంది దీన్ని వినియోగిస్తారు...

Facebook: ఫేస్‎బుక్ పేరు మారుతుందా.. అక్టోబర్ 28న ఏం జరగబోతుంది..
Fb
Follow us on

ఫేస్‎బుక్ సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్‎కు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఖాతాదారులు ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో చాలా మంది దీన్ని వినియోగిస్తారు. ఫేస్‎బుక్ ఆధ్వర్యంలో వాట్సాప్, ఇన్‎స్టాగ్రామ్ పని చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఫేస్‎బుక్, వాట్సాప్, ఇన్‎స్టాగ్రామ్ 6 గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో వీటి నుంచి చాలా మంది ఇతర సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్స్ లోకి వెళ్లారు. ఇన్‎స్టాగ్రామ్ ఖాతాదారులు భారీగా తగ్గుతున్నట్లు గుర్తించిన కంపెనీ దిద్దుపాటు చర్యలు చేపట్టింది. యువతను ఆకట్టుకోవడానికి భారీ ఖర్చు చేయాలని నిర్ణయించారు.

ఇది ఇలా ఉంటే.. ఫేస్‌బుక్ ఇంక్ వచ్చే వారం కంపెనీని కొత్త పేరుతో రీబ్రాండ్ చేయడానికి యోచిస్తోన్నట్లు మంగళవారం వెర్జ్ నివేదించింది. ఫేస్‎బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ అక్టోబర్ 28 న కంపెనీ వార్షిక కనెక్ట్ కాన్ఫరెన్స్‌లో పేరు మార్పు గురించి మాట్లాడాలని యోచిస్తున్నారని తెలిపింది. అయితే త్వరలో పేరు మార్పు ఉండవచ్చని వెర్జ్ నివేదిక పేర్కొంది. రీబ్రాండ్ ఫేస్‌బుక్ యొక్క సోషల్ మీడియా యాప్‌ను అనేక ఉత్పత్తులలో ఒకటిగా ఉంచే అవకాశం ఉంది పేరెంట్ కంపెనీ కింద, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఓకులస్ మరిన్ని వంటి సమూహాలను కూడా పర్యవేక్షిస్తుందని నివేదిక తెలిపింది. దీనిపై ఫేక్‎బుక్ స్పందించలేదు.

Read Also.. Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలో మాత్రం ఇలా..