Aadhaar: ఇక నో టెన్షన్‌.. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఆధార్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఫీచర్‌..!

Aadhaar Card: ఆధార్ కార్డు ముఖ ప్రామాణీకరణను ఉపయోగించడానికి మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త ఆధార్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీని తరువాత అనుసరించాల్సిన దశలను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని అయినా స్కాన్ చేయడం ద్వారా

Aadhaar: ఇక నో టెన్షన్‌.. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఆధార్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఫీచర్‌..!

Updated on: Apr 09, 2025 | 1:27 PM

ఇప్పటివరకు హోటళ్ళు, కళాశాలలు, ఇతర ప్రదేశాలలో మీ గుర్తింపు కోసం ఆధార్ కార్డు సాఫ్ట్, హార్డ్ కాపీని అడిగేవారు. కానీ ఇక నుండి అలా ఉండదు. ఆధార్‌ కార్డు జారీ సంస్థ యూఐడీఏఐ (UIDAI) ఆధార్ కార్డుకు స్మార్ట్ ఫేస్ ప్రామాణీకరణ ఫీచర్‌ను జోడించింది. మీ స్మార్ట్‌ఫోన్ సహాయంతో మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా మీ ఆధార్ కార్డు గుర్తిస్తుంది. అలాంటి సమయంలో మీరు సాఫ్ట్‌ కాపీని అందించాల్సిన అవసరం ఉండదు.

సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం.. ఆధార్ ప్రామాణీకరణ చాలా సులభం అవుతుంది. మీరు UPI ద్వారా లావాదేవీలు చేసే విధానం కూడా సులభతరం అవుతుంది. అంతేకాకుండా మీరు ఆధార్‌ను ధృవీకరించవచ్చు. యూపీఐ లావాదేవీలకు స్మార్ట్‌ఫోన్ అవసరమైనట్లే, ఆధార్ ప్రామాణీకరణకు కూడా స్మార్ట్‌ఫోన్ అవసరం.

వ్యక్తిగత వివరాలు సురక్షితం:

యూఐడీఏఐ స్మార్ట్ ప్రామాణీకరణ ఫీచర్‌తో మీ వ్యక్తిగత సమాచారం అందరికీ అందుబాటులో ఉండదు. ఆధార్ కార్డు స్మార్ట్ ప్రామాణీకరణతో ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డు కాపీని హార్డ్, సాఫ్ట్ కాపీలలో ఇవ్వాల్సిన అవసరం లేదు. బదులుగా స్మార్ట్‌ఫోన్ సహాయంతో మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆధార్ నంబర్‌ను ధృవీకరించవచ్చు.

ఫేస్ ప్రామాణీకరణ ఎలా పని చేస్తుంది:

ఆధార్ కార్డు ముఖ ప్రామాణీకరణను ఉపయోగించడానికి మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త ఆధార్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీని తరువాత అనుసరించాల్సిన దశలను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని అయినా స్కాన్ చేయడం ద్వారా ఆధార్‌ను ధృవీకరించవచ్చు. దీనిలో సంబంధిత వ్యక్తి గురించి ముఖ్యమైన సమాచారం మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని మీరు ధృవీకరించవచ్చు. ఆధార్ కార్డు ముఖ ప్రామాణీకరణ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ వెర్షన్‌లో అందుబాటులో ఉందని, సామాన్యులు దీన్ని ఉపయోగించడానికి కొంచెం వేచి ఉండాల్సి రావచ్చు.

 


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి