Ration And Aadhar Link: రేషన్‌ ఆధార్‌ లింక్‌ చేయడానికి గడువు పెంపు.. ఆఖరి తేదీ ఎప్పుడంటే..?

చాలా మందికి, రేషన్ కార్డులు గుర్తింపు రుజువుగా కూడా పని చేస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి, అలాగే వాటి అమలులో మోసాలను అరికట్టడానికి ఆధార్‌ లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. రేషన​ కార్డు-ఆధార్ కార్డ్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30గా నిర్ణయించినా.. భారత ప్రభుత్వం ఇప్పుడు గడువును సెప్టెంబర్ 30, 2023 వరకు పొడిగించింది.

Ration And Aadhar Link: రేషన్‌ ఆధార్‌ లింక్‌ చేయడానికి గడువు పెంపు.. ఆఖరి తేదీ ఎప్పుడంటే..?
Aadhaar Card
Follow us
Srinu

|

Updated on: Jul 05, 2023 | 5:00 PM

భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సబ్సిడీ రేటుతో ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి అర్హులైన వ్యక్తులకు రేషన్ కార్డులను జారీ చేస్తుంది. చాలా మందికి, రేషన్ కార్డులు గుర్తింపు రుజువుగా కూడా పని చేస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి, అలాగే వాటి అమలులో మోసాలను అరికట్టడానికి ఆధార్‌ లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. రేషన​ కార్డు-ఆధార్ కార్డ్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30గా నిర్ణయించినా.. భారత ప్రభుత్వం ఇప్పుడు గడువును సెప్టెంబర్ 30, 2023 వరకు పొడిగించింది. అంత్యోదయ అన్న యోజన పథకం కింద ప్రయోజనాలను పొందుతున్న వారికి ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడం తప్పనిసరి చేసింది. 

మీ ఆధార్, రేషన్ కార్డును లింక్ చేయడానికి మీరు ఉచితంగా సేవను పొందేందుకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించాలి. వినియోగదారులు బహుళ రేషన్ కార్డులను కలిగి ఉండకుండా నిరోధించడానికి ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేసింది. అనర్హులకు వారి ఆదాయం పరిమితికి మించి ఉన్నందున రేషన్ కలిగి ఉండేలా పర్యవేక్షించడానికి ఇది అధికారులకు సహాయపడుతుంది. రేషన్ కార్డులు ప్రజలకు సబ్సిడీ రేటుతో ఆహారం పొందడానికి, గుర్తింపు రుజువుగా ముఖ్యమైన పత్రంగా కూడా ఉపయోగించవచ్చు. తెల్ల రేషన​ కార్డు హోల్డర్లు ముందుగా తమ రేషన్ కార్డును డిజిటలైజ్ చేసి ఆ తర్వాత తమ కార్డులను ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు. ఒక సర్వే ప్రకారం మహారాష్ట్రలో 24.4 లక్షల మంది పేద కుటుంబాల్లోని పేద కుటుంబాలు సబ్సిడీతో కూడిన ఆహారాన్ని పొందే పథకాల పరిధిలోకి వచ్చారు. మహారాష్ట్రలో కనీసం 2.56 కోట్ల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. తెల్ల కార్డులు ఉన్నవారు తమ కార్డులను డిజిటలైజ్ చేసి లింక్ చేయాలి. మీ తెల్ల కార్డులను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి కాదని మాత్రం అక్కడి అధికారులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో లింక్‌ చేసుకోండిలా

  • కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
  • అక్కడ రేషన్‌, ఆధార్‌ లింక్‌కు సంబంధించి అవసరమైన వివరాలను నమోదు చేయాలి. అంటే ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ వంటి వివరాలను ఇవ్వాలి.
  • అనంతరం ‘కొనసాగించు’పై క్లిక్ చేయాలి.
  • మీరు మీ రిజిస్టర్డ్ నంబర్‌లో ఓటీపీను అందుకుంటారు
  • ఓటీపీను నమోదు చేయడం ద్వారా మీ రేషన్, ఆధార్‌ను సింపుల్‌గా లింక్​ చేసుకోవచ్చు. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం