Used Cars: పాత చౌక కారు కొనాలనుకుంటున్నారా.. ఈ వాహనాలు రూ.లక్ష కంటే తక్కువ ధరకే.. ఎక్కడో తెలుసా..

Second Hand Cars: మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో జూలై 4, 2023న లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు ఢిల్లీలో, రెండు లక్షల కంటే తక్కువ ధరకు హైదరాబాద్‌లో పెట్టింది. ఇందులో కొన్ని యూజ్డ్ కార్లు లిస్ట్ చేయబడటం మనం చూడవచ్చు. వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం

Used Cars: పాత చౌక కారు కొనాలనుకుంటున్నారా.. ఈ వాహనాలు రూ.లక్ష కంటే తక్కువ ధరకే.. ఎక్కడో తెలుసా..
Used Cars
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 05, 2023 | 1:26 PM

ప్రస్తుతం ద్విచక్ర వాహనాల ధరలు కూడా చాలా పెరిగాయి. మీరు మంచి మోటార్‌సైకిల్ లేదా స్కూటర్‌ని కొనుగోలు చేయడానికి వెళితే.. దాని ఆన్-రోడ్ ధర కూడా దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో.. దాదాపు లక్ష రూపాయల పాత చౌకైన చిన్న కారును ఎందుకు కొనుగోలు చేయకూడదని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ, ఇంత తక్కువ ధరకు కారు దొరుకుతుందా? దొరికితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? కానీ అలాంటి కార్ల కండీషన్ నిజంగా బాగుంటుందా.. ఇది ఎలా గుర్తుంచుకోవాలి.. సరే, మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో జూలై 4, 2023న రూ. 1 లక్షలోపు కొన్ని యూజ్డ్ కార్లను పెట్టింది. వాటి గురించి చెప్పుకుందాం.

ముందుగా మనం మన హైదరాబాద్‌లో కూడా లభించే కొన్నింటి గురించి ఇక్కడ చూద్దాం.

  • మన హైదరాబాద్‌లో కూడా కొన్నింటి లిస్ట్ చేసింది. రూ. 1,85,000 అమ్మకానికి పెట్టింది. ఇందులో జెన్జెన్ ఎస్టిలో LXI గ్రీన్, ఇది CNG, ఇప్పటి వరకు 1,51,833 కిలోమీటర్లు తిరిగింది.
  • మారుతి ఆల్టో ఎల్ఎక్స్ కారు రూ. 1.50 వేలకు అమ్మకానికి పెట్టారు. ఇది ఇప్పటి వరకు 1,50,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది కూడా సీఎంజీ వాహనం.
  • ఎస్టీమ్ ఎల్ఎక్స్ఏ కారు కేవలం రూ. లక్ష 10 వేలకు మాత్రమే అమ్మకానికి పెట్టింది. ఇది 2007 సంవత్సరానికి చెందింది. ఇప్పటి వరకు 38 వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది.

ఢిల్లీలో చూస్తే..

  • మారుతి వ్యాగన్ R LXI (2008) కోసం అడిగే ధర రూ. 70,000 ఇక్కడ జాబితాలో లిస్ట్ చేసింది. ఈ పెట్రోల్ కారు కేవలం 71,209 కి.మీ. ఇది ప్రస్తుతం మొదటి యజమాని కారు, న్యూ ఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
  • మారుతి ఆల్టో ఎల్‌ఎక్స్‌ఐ (2010) కోసం అడిగే ధర రూ. 90,000 ఇక్కడ లిస్ట్ చేయబడింది. ఈ పెట్రోల్ కారు మొత్తం 1,08,040కి.మీలు ప్రయాణించింది. ఇది మొదటి యజమాని కారు.. ఇది న్యూఢిల్లీలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది.
  • ఇక్కడ జాబితా చేయబడిన మరో మారుతి జెన్ ఎస్టిలో LXI (2010) అదే ధర రూ.90,000 అడుగుతోంది. ఈ పెట్రోల్ కారు మొత్తం 127505కిమీలు ప్రయాణించింది. ఈ ఫస్ట్ ఓనర్ కారు న్యూఢిల్లీలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.
  • మారుతి ఆల్టో LXI (2009) కూడా ఇక్కడ జాబితా చేయబడింది, దీని ధర రూ. 1.02 లక్షలు. ఈ పెట్రోల్ కారు మొత్తం 29635కిమీలు ప్రయాణించింది. ఇది మొదటి యజమాని కారు. కారు న్యూఢిల్లీలో అమ్మకానికి ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం