రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం(Russia Ukrain War) ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా ఉండవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్(Mutual Fund) పెట్టుబడిదారులు మంచి అవకాశంగా మారింది. పడిపోతున్న షేర్లను కొనుగోలు చేసేందుకు ఫిబ్రవరిలో రూ.19,705 కోట్లు పెట్టుబడి పెట్టారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (Amfi) డేటా ప్రకారం, ఫిబ్రవరిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మొత్తం రూ.19,705 కోట్ల పెట్టుబడి పెట్టారు. జనవరి నెలలో ఇది రూ.14,887 కోట్లుగా ఉంది. ఫ్లెక్సీ క్యాప్, సెక్టోరల్ ఫండ్‌లలో ఎక్కువ పెట్టుబడి పెట్టారు. వీటిలోకి రూ.3,000 కోట్లు వచ్చాయి.
అయితే, పెట్టుబడిదారులు డెట్ సెగ్మెంట్ నుంచి డబ్బును ఉపసంహరించుకున్నారు. ఇందులో మొత్తం రూ.8,274 కోట్లు ఉపసంహరించుకున్నారు. లిక్విడ్ ఫండ్‌లో రూ.40,273 కోట్ల పెట్టుబడులు పెట్టారు. షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ నుంచి 10-10 వేల కోట్లు వెనక్కి తీసుకున్నారు. మిడ్‌క్యాప్ ఫండ్ జనవరిలో రూ. 1,770 కోట్ల నుంచి రూ.1,954 కోట్ల పెట్టుబడి పెట్టారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వస్తున్న పెట్టుబడి ఫిబ్రవరిలో రూ.17 కోట్లు తగ్గి రూ.11,444 కోట్లకు చేరుకుంది. మొత్తం SIP ఖాతాల సంఖ్య 5.05 కోట్ల నుంచి 5.17 కోట్లకు పెరిగింది. ఫిబ్రవరి నెలలో మ్యూచువల్ ఫండ్ మొత్తం 42,084 కోట్ల షేర్లను కొనుగోలు చేశాయి. జనవరిలో రూ.21,928 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి.
గత 6 నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌లో నిరంతరం విక్రయాలు జరుపుతున్న తరుణంలో ఇది జరిగింది. ఫిబ్రవరిలో సెన్సెక్స్ 3% పైగా నష్టపోయింది. BSE మిడ్‌క్యాప్ 5% పైగా పడిపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 8.7 శాతం క్షీణించింది. అయితే మంగళ, బుధవారాల్లో భారత మార్కెట్‌లో మంచి ర్యాలీ కనిపించింది. సెన్సెక్స్ మంగళవారం 581, బుధవారం మధ్యాహ్నం 12,00 పాయింట్లకు పైగా పెరిగింది. రెండు రోజుల్లో దాదాపు 3% పెరిగింది. ఇంకా అక్టోబర్‌తో పోలిస్తే 12% తగ్గింది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తి (AUM) రూ.31,533 కోట్లు పెరిగి రూ.37.56 లక్షల కోట్లకు చేరుకుంది. AUM అనేది ఈ పరిశ్రమలోని పెట్టుబడిదారుల డబ్బు విలువను సూచిస్తుంది.