AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి మంచి ఛాన్స్.. ప్రతీ నెల అకౌంట్లోకి డబ్బులు.. ఈ ఒక్క పని చేస్తే చాలు..

ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్నవారికి ఎంప్లాయి పెన్షన్ స్కీమ్‌ను కేంద్రం అమలు చేస్తోంది. దీని ద్వారా మీరు రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా ఈపీఎఫ్ఓను పెన్షన్ పొందవచ్చు. ప్రస్తుతం మినిమం పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉంది. దీనిని రూ.5 వేలకు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి మంచి ఛాన్స్.. ప్రతీ నెల అకౌంట్లోకి డబ్బులు.. ఈ ఒక్క పని చేస్తే చాలు..
Epfo
Venkatrao Lella
|

Updated on: Sep 01, 2026 | 3:46 PM

Share

ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీఒక్క ఉద్యోగికి ఈపీఎస్ పథకం కూడా వర్తిస్తుంది. ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్‌గా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ అందిస్తారు. అదే తరహాలో ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ తర్వాత ఈ స్కీమ్‌తో పెన్షన్ సదుపాయం కల్పిస్తోంది. అయితే ఈ పథకం కోసం ఉద్యోగి ఎటువంటి చందా కట్టాల్సిన పని లేదు. యజమాని కాంట్రిబ్యూషన్ నుంచే కొంత మొత్తాన్ని పెన్షన్ కోసం తీసుకుంటారు. అలాగే కేంద్రం కొంత మొత్తం జమ చేస్తుంది. 60 ఏళ్ల వయస్సు తర్వాత ప్రతీ నెలా కేంద్రం పెన్షన్ అందిస్తూ ఉంటుంది. వీటిని నేరుగా బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు.

పెన్షన్ ఎంత వస్తుంది..?

అయితే పెన్షన్ ఎంత వస్తుందనేది మీ జీతం, మీ సర్వీస్ పీరియడ్‌ను బట్టి ఉంటుంది. నెలలవారీ పింఛన్=అర్హత గల జీతం× పింఛను అర్హత గల సర్వీసు ÷ 70 ఆధారంగా లెక్కిస్తారు. ప్రస్తుతం పింఛన్‌కు అర్హత గల గరిష్ట జీతం నెలకు రూ.15 వేలుగా ఉంది. మీ పెన్షన్ అర్హత జీతం రూ.15 వేలుగా ఉండి 15 ఏళ్ల పాటు సర్వీస్ పూర్తి చేస్తే నెలకు రూ.3214 పెన్షన్ లభిస్తుంది. అంటే ఏడాదికి రూ.38,568 పెన్షన్ అందుకుంటారు. అదే 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే రూ.2140 అందుతుంది. రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ పొందాలంటే కనీసం ఈపీఎఫ్‌వోలో పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అంతకంటే తక్కువ కాలం పనిచేస్తే నెలవారీ పెన్షన్ అందదు. ఇలాంటి సమయంలో పెన్షన్ అమౌంట్‌ను ఒకేసారి విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మీ బేసిక్ శాలరీ రూ.20, రూ.30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా రూ.15 వేల జీతం ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరుగుతుంది.

కేంద్రం రూ.25 వేలకు పెంచుతుందా..?

అయితే ప్రస్తుతం ఉన్న గరిష్ట బేసిక్ శాలరీ లిమిట్‌ను రూ.25 వేలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన రావొచ్చని చెబుతున్నారు. ఇదే జరిగితే ఎక్కువ జీతం ఉన్నవారు అధిక పెన్షన్ పొందవచ్చు. చివరిసారిగా 2014లో వేతన పరిమితిని రూ.6500 నుంచి రూ.15 వేలకు పెంచారు. ఆ తర్వాత ఇక ఇప్పటివరకు పెంచలేదు. అయితే వేతన పరిమితి రూ.25 వేలకు పెంచితే.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినవారికి రూ.3571 అందుతుంది. ఇక 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే రూ.7857 అందుతుంది. 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే రూ.11,429 అందుతుంది.

Follow Us