EPFO: ప్రభుత్వం వేతన పరిమితి రూ.21,000 పెంచితే ఈపీఎఫ్‌, ఈపీఎస్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయి?

|

Dec 04, 2022 | 6:37 PM

మోడీ సర్కార్‌ ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వేతన పరిమితిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 2014 సెప్టెంబర్‌ నెలలో చివరగా వేతన పరిమితిని పెంచారు. ఇప్పుడున్న..

EPFO: ప్రభుత్వం వేతన పరిమితి రూ.21,000 పెంచితే ఈపీఎఫ్‌, ఈపీఎస్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయి?
Follow us on

మోడీ సర్కార్‌ ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వేతన పరిమితిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 2014 సెప్టెంబర్‌ నెలలో చివరగా వేతన పరిమితిని పెంచారు. ఇప్పుడున్న రూ.15000 పరిమితిని రూ.21,000లకు పెంచాలని చాలా రోజుల నుంచి ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వారి అభ్యర్థన మేరకు 2023 బడ్జెట్‌లో వేతన పరిమితిపై ప్రకటన చేసే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. మరి రూ.21,000కు పెంచితే ఈపీఎఫ్‌లో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం మాత్రం ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌) అకౌంట్‌కు సంబంధించిన వివరాళలు నెలకు రూ.15000 ప్రాథమిక వేతనం పరిమితం చేయడం ద్వారా లెక్కిస్తారు. ఈపీఎఫ్‌ గరిష్ట సహకారం నెలకు రూ.1250కి పరిమితం చేశారు. ఒక వేళ ప్రభుత్వం రూ.21,000లకు పెంచినట్లయితే నెలవారి ఈపీఎఫ్‌ రూ.1,749 అవుతుంది.

ఉద్యోగుల భవిష్య నిధి, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం.. ఒక ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఈపీఎఫ్‌ ఖాతాకు ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్, రిటైనింగ్ అలవెన్స్‌లో 12% చొప్పున సరిపోలే విరాళాలను అందజేస్తారు. ఉద్యోగి మొత్తం కంట్రిబ్యూషన్ ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేయబడుతుంది. మరోవైపు యజమాని 12% జమ చేసే కంట్రిబ్యూషన్‌లో 8.33% ఉద్యోగుల పెన్షన్ పథకంలోకి వెళ్తుంది. ఇక మిగిలిన 3.67% ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారు. ఈపీఎఫ్‌ స్కీమ్‌ కింద వేతన పరిమితిని పెంచడం వల్ల పదవీ విరమణ సమయంలో అధిక పెన్షన్‌ మొత్తం వర్తిస్తుంది. (ఉద్యోగి సర్వీస్‌x 60 నెలల సగటు నెలవారీ వేతనం) 70 సూత్రాన్ని ఉపయోగించి పెన్షన్‌ను లెక్కిస్తారు. వేతన పరిమితిని రూ.21,000 పెంచినట్లయితే అందుకున్న పెన్షన్‌ మొత్తంపెరుగుతుంది.

ఒక ఉద్యోగి పెన్షన్‌ సర్వీసు వ్యవధి 32 సంవత్సరాలు అనుకుంటే పదవీ విరమణకు ముందు 60 నెలల సగటు వేతనం ద్వారా నెలవారీ జీతం లెక్కించబడుతుంది. అయితే 60 నెలల్లో ఉద్యోగి ప్రాథమిక వేతనం నెలకు రూ.15,000 కంటే ఎక్కువగా ఉంటే పెన్షన్‌ కోసం గణన లెక్కించడానికి రూ.15,000 ఒక నెల జీతంగా పరిగణిస్తారు. ఒకవేళ ఉద్యోగి 20 ఏళ్లకు మించే పనిచేసినట్లయితే ఉద్యోగ కాలానికి రెండు సంవత్సరాల బోనస్‌గా జోడిస్తారు. అప్పుడు ఈపీఎస్‌ సభ్యుడు అర్హులైన నెలవారీ పెన్షన్‌ రూ.7286(34×15,000)/70. వేతన పరిమితిని పెంచినట్లయితే సగటు నెలవారీ జీతం రూ.21,000 అవుతుంది. అటువంటి సందర్భంలో ఒక ఉద్యోగి నెలవారి పెన్షన్‌ పొందేందుకు రూ.10,200 అంటే (34×21,000) 70. వేతన పరిమితిలో రూ.6,000 పెరుగుదలతో నెలవారీ పెన్షన్‌ సుమారు రూ.2,900 పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఈపీఎఫ్‌ చట్టాల ప్రకారం.. ఒక ఉద్యోగి నెలవారీ ప్రాథమిక వేతనం రూ.15,000 దాటితే వారు ఈపీఎఫ్‌ పథకంలో భాగమైనప్పటికీ, ఈపీఎఫ్‌లో చేరలేరు. అయితే వేతన పరిమితిని రూ.21,000కు పెంచినట్లయితే, రూ.15,000 కంటే ఎక్కువ ప్రాథమిక వేతనంతో ఈపీఎఫ్ పథకంలో చేరిన ఉద్యోగులు ఈపీఎస్‌లో చేరేందుకు అర్హులు.

తగ్గనున్న ఈపీఎఫ్‌ కార్పస్‌

ప్రస్తుతం నెలకు రూ.1,250గా ఉన్న ఈపీఎస్‌ జమ రూ.1749కి పెరిగితే ఇప్పటికే ఉన్న ఉద్యోగుల ఈపీఎఫ్ కార్పస్‌ తగ్గుతుంది. ఒక ఉద్యోగి కనీస వేతనం రూ.30,000 అనుకుందాం. అందులో ఎంప్లాయర్‌ 12 శాతం రూ.3600 ఈపీఎఫ్‌ ఖాతాలోకి జమ చేస్తారు.ఈ 12 శాతం కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఈపీఎస్‌ ఖాతాలోకి వెళ్తుంది. కనీస వేతనం రూ.15,000 ఉన్నప్పుడు ఈపీఎస్‌ ఖాతాలోకి వెళ్లే మొత్తం నెలకు రూ.1250 మాత్రమే పరిమితం చేయబడుతుంది. మిగిలిన రూ.2350ను ఈపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తారు. వేతన పరిమితి పెంపు కారణంగా ఈపీఎస్‌లో రూ.1851 జమ చేయబడుతుంది. అందుకే ఈపీఎఫ్‌లోకి రూ.1749 మాత్రమే జమ చేయబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి