AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ వడ్డీ అకౌంట్లోకి వచ్చేసింది.. మీకు పడిందా..? లేదా?.. సెకన్లలోనే ఇలా తెలుసుకోవచ్చు..

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ వడ్డీని అర్హులైన ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఇప్పటికే చాలామంది అకౌంట్లలో జమ అవుతున్నాయి. మిగతావారి అకౌంట్లలో జులై 15వ తేదీలోపు జమ కానుంది. అయితే మీకు వడ్డి పడిందా.. లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అదెలా అనేది చూద్దాం.

EPFO: పీఎఫ్ వడ్డీ అకౌంట్లోకి వచ్చేసింది.. మీకు పడిందా..? లేదా?.. సెకన్లలోనే ఇలా తెలుసుకోవచ్చు..
Epfo Withdraw
Venkatrao Lella
|

Updated on: Jul 11, 2026 | 9:26 PM

Share

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీఎప్ వడ్డీ జమ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే చాలామంది ఖాతాల్లోకి వడ్డీ నగదు వచ్చేసింది. జూలై 15 లోపు అందరి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. గత ఆర్ధిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ ప్రకటించింది. ఇప్పుడు దాని ప్రకారం జమ చేస్తోంది. సుమారు రూ.1.44 లక్షల కోట్లకు పైగా వార్షిక వడ్డీని ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేసి, ఆ తర్వాత ఫీల్డ్ అథారిటీలచే ధృవీకరించి సభ్యుల ఖాతాలకు పీఎఫ్ సంస్థ జమ చేస్తోంది. అయితే మీకు వడ్డీ పడిందా.. లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం.

యూఏఎన్ పోర్టల్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి..?

-https://passbook.epfindia.gov.in/MemberPassBook/login

-UAN నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఉపయోగించి సైన్ ఇన్ చేయండి

-మీ ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.

-సంబంధిత కంపెనీ IDని ఎంచుకోండి.

-“పాస్‌బుక్‌ను వీక్షించండి” పై క్లిక్ చేయండి

-పాస్‌బుక్‌లో దిగువన మీరు పీఎఫ్ వడ్డీ ఎంత పడిందనేది చెక్ చేసుకోవచ్చు

ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలా..?

-గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఉమాంగ్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోండి

-ఆ తర్వాత యాప్‌ను తెరిచి సెర్చ్‌లో EPFO అని సెర్చ్ చేయండి

-ఈపీఎఫ్‌వో సేవలను ఎంచుకోండి

-అనంతరం పాస్‌బుక్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-UAN నెంబర్ ఎంటర్ చేసి మొబైల్‌కు పంపిన OTPని నమోదు చేసింది

-అనంతరం యజమాని ఖాతాను ఎంచుకోండి

-అక్కడ పీఎఫ్ బ్యాలెన్స్‌లో వడ్డీని చెక్ చేసుకోవచ్చు

మిస్డ్ కాల్ నంబర్ ద్వారా తెలుసుకోవడం ఎలా..?

-మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి

-రెండు రింగుల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది.

-మీ PF వివరాలు (మెంబర్ ఐడి, చివరి కాంట్రిబ్యూషన్ మరియు మొత్తం బ్యాలెన్స్) ఉన్న ఒక SMS మీకు వస్తుంది

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర