AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఉద్యోగం మానేసిన తర్వాత ఎంత మొత్తంలో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు..? కొత్త రూల్స్ అమల్లోకి..

ఈపీఎఫ్ఓ కొత్త విత్ డ్రా రూల్స్ అమల్లోకి తెచ్చింది. మీరు మీ పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్ మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చేసుకోలేరు. మీరు ఉద్యోగం కోల్పోయినా లేదా మానేసినా వెంటనే 100 శాతం నగదు తీసుకోవచ్చని అనుకుంటారు. కానీ అందుకు ఈపీఎఫ్ఓ నిబంధనలు అంగీకరించవు.

EPFO: ఉద్యోగం మానేసిన తర్వాత ఎంత మొత్తంలో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు..? కొత్త రూల్స్ అమల్లోకి..
Epfo
Venkatrao Lella
|

Updated on: Oct 21, 2026 | 6:47 PM

Share

ఈపీఎఫ్ఓ ఇటీవల కొత్త విత్ డ్రాయల్ రూల్స్ తీసుకొచ్చింది. గతంలో ఉన్న నిబంధనలను పూర్తిగా మార్చింది. దీంతో పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు తమ ఖాతాలోని బ్యాలెన్స్‌ను తీసుకోవాలంటే కొత్త నియమాల గురించి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరముంది. లేకపోతే పీఎఫ్ నగదు ఉపసంహరించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. నిబంధనల గురించి తెలుసుకోకుండా క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టుకుంటే తిరస్కరణకు గురవుతుంది. మీరు పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నా, భవిష్యత్తులో తీసుకోవాలని అనుకుంటున్నా ఈ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోండి. పీఎఫ్ విత్ డ్రాకు సంబంధించి కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ ఏంటనేది డీటైల్డ్‌గా చూద్దాం.

ఉద్యోగం మానేశాక పీఎఫ్ మొత్తం విత్ డ్రా చేసుకోలేమా..?

ఉద్యోగం మానేసిన తర్వాత లేదా ఉద్యోగం కోల్పోయిన సమయంలో ఆదాయం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ సరైన అవగాహన లేకుండా క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టుకుంటే వెంటనే రిజెక్ట్ అయ్యే అవకాశముంది. దీని వల్ల మీ అవసరాలకు నగదు వెంటనే అందవు. ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగానికి మీరు రాజీమానా చేసినా లేదా కోల్పోయినా వెంటనే మొత్తం 100 శాతం తీసుకోలేరు. కేవలం మీ బ్యాలెన్స్‌లోని 75 శాతం నగదును మాత్రమే వెంటనే తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మిగిలిన 25 శాతం తీసుకోవాలంటే ఏడాది పాటు వేచి ఉండాల్సిందే. మీరు ఏడాది పాటు వేరే కంపెనీలో చేరకుండా నిరుద్యోగిగా ఉంటే మిగిలిన 25 శాతం కూడా ఉపసంహరించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కొత్త నియమాల ప్రకారం మీరు విత్ డ్రా చేసుకోవడానికి కుదరదు.

ఉద్యోగంలో ఉండగానే తీసుకోవాలంటే..?

ఉద్యోగం చేస్తున్నప్పుడు మీరు పాక్షికంగా పీఎఫ్ నగదు తీసుకోవచ్చు. అయితే విద్య, ఇంటి రుణం, పెళ్లి, మెడికల్ కారణాలు చూపించి 75 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం అడ్వాన్స్ క్లెయిమ్ సమర్పించాల్సి ఉంటుంది. క్లెయిమ్ సమర్పించిన తర్వాత మూడు రోజల్లోపు మీ అకౌంట్లో జమ అవుతాయి. మీ బ్యాంక్ వివరాలు, కేవైసీ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఆధార్, పాన్ వివరాలు అప్డేట్ చేసుకుని ఉండాలి. అప్పుడే క్లెయిమ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. వివరాలు తప్పుగా ఉంటే మీ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. పీఎఫ్ రికార్డులు తప్పులు లేకుండా కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే ఈపీఎఫ్‌ఓ వెబ్ సైట్ ద్వారా సవరణలు చేసుకోవాలి. అన్నీ వివరాలు చెక్ చేసుకున్న తర్వాతనే క్లెయిమ్ అప్లై చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us