EPFO: పీఎఫ్ అకౌంట్లో వివరాలు తప్పుగా పడ్డాయా..? సెకన్లలోనే మార్చుకోవచ్చు.. స్టెప్ బై సెప్ట్ ప్రాసెస్ ఇదే..

ఈపీఎఫ్‌వోలా ఖాతాదారులుగా ఉన్నారా.. మీ వివరాలు తప్పుగా నమోదయ్యాాయా.. ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదా.. అయితే మీకో తీపికబురు. ఈపీఎఫ్‌వో తన పోర్టల్ ద్వారా సులభంగా వివరాలను మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. వాటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు ఇందులో చూద్దాం.

EPFO: పీఎఫ్ అకౌంట్లో వివరాలు తప్పుగా పడ్డాయా..? సెకన్లలోనే మార్చుకోవచ్చు.. స్టెప్ బై సెప్ట్ ప్రాసెస్ ఇదే..
Epfo

Updated on: May 28, 2026 | 11:07 AM

పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఆన్‌లైన్ సేవలు అందిస్తోంది. పీఎఫ్‌కు అకౌంట్‌కు సంబంధించి ఏ పనైనా సులువుగా ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారందరికీ పీఎఫ్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈపీఎఫ్‌వో సంస్థ ఈ ఫండ్‌ను నిర్వహిస్తూ ఉంటుంది. ఈపీఎఫ్‌వో పోర్టల్ ద్వారా ఉద్యోగులకు సులభతరంగా సేవలు అందిస్తోంది. అయితే పొరపాటున పీఎఫ్ వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నా సులువుగా మార్చుకోవచ్చు. చాలామందికి ఎలా మార్చుకోవాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. కానీ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిమిషాల్లోనే సులువుగా వివరాలు ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. అదెలా అనేది ఇందులో చూద్దాం.

ఈ వివరాలు మార్చుకోవచ్చు

పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, తండ్రి లేదా భర్త పేరు, రిలేషన్‌షిప్, మ్యారేజ్ స్టేటస్, నేషనాలిటీ, ఈపీఎఫ్ జాయినింగ్ డేట్, రీజన్ ఫర్ క్విట్టింగ్, ఎగ్జిట్ డేట్, ఈపీఎఫ్ జాయినింగ్, క్విట్టింగ్ డేట్‌తో పాటు ఈపీఎస్ జాయినింగ్, క్విట్ డేట్ వంటివి సలువుగా మార్చుకోవచ్చు.

మార్చుకోవడం ఎలా..?

ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి వెళ్లండి
-హోమ్ పేజీలో సర్వీసెస్ అని కనిపించే ట్యాబ్‌ను ఓపెన్ చేయండి
-ఫర్ ఎంప్లాయిస్ అనే ఆప్షన్ ఎంచుకోండి
కొత్త ఫేజీలో యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
-ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
-హోమ్ పేజీలో మేనేజ్ ఆప్షన్‌ ఎంచుకోండి
-జాయింట్ డిక్లరేషన్‌పై క్లిక్ చేయండి
-మెంబర్ ఐడీ దగ్గర మీరు ప్రస్తుతం పని చేస్తున్న ఆఫీస్ నేమ్ ఎంచుకోండి
-గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయండి
-స్క్రీన్‌పై మీ వివరాలన్నీ వస్తాయి. అందులో ఏ వివరాలు అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిని క్లిక్ చేయండి
-వివరాలు నమోదు చేయండి
-డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి

అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే..

-పేరు, లింగం మార్చుకునేందుకు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ అవసరం
-డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునేందుకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ మెమో, పాస్ పోర్డ్, ఆధార్ సబ్మిట్ చేయాలి
-తండ్రి లేదా భర్త పేరు మార్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్, రేషన్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు పత్రాలు
-కంపెనీ వివరాలు మార్చుకోవాలంటే అపాయింట్‌మెంట్ లెటర్, రిలీవింగ్ టెర్, ఈఎస్‌ఐసీ కార్డ్ వివరలు అవసరం

Follow Us