EPFO Subscribers: ఈపీఎఫ్‌వోలో 14.65 లక్షల మంది సభ్యుల చేరిక.. వివరాలు వెల్లడించిన సంస్థ

EPFO Subscribers: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో కొత్త సభ్యుల నమోదు జూన్‌తో పోలిస్తే జూలై నెలలో నికరంగా 31.28 శాతం పెరిగింది. జూన్‌లో..

EPFO Subscribers: ఈపీఎఫ్‌వోలో 14.65 లక్షల మంది సభ్యుల చేరిక.. వివరాలు వెల్లడించిన సంస్థ

Updated on: Sep 21, 2021 | 2:28 PM

EPFO Subscribers: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో కొత్త సభ్యుల నమోదు జూన్‌తో పోలిస్తే జూలై నెలలో నికరంగా 31.28 శాతం పెరిగింది. జూన్‌లో 11.16 లక్షలు ఉండగా, జూలైలో 14.65 లక్షలు నమోదైంది. వీరిలో 9.02 లక్షల మంది మొదటిసారిగా చేరిన వారు ఉండగా, మిగతా వారు గతంలో ఈపీఎఫ్‌వో నుంచి వైదొలిగి..మళ్లీ కొత్త ఉద్యోగంలో చేరడం ద్వారా తిరిగి సభ్యత్వం పొందిన వారు ఉన్నారు. దేశీయంగా సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన మెరుగుపడటాన్ని ఇది ప్రతిబింబిస్తోందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈపీఎఫ్‌వో సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నాలుగు నెలలుగా చందాదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్‌లో కొత్త సభ్యుల నమోదు నికరంగా 8.9 లక్షలుగా ఉండగా, మే నెలలో 6.57 లక్షలుగా నమోదైంది. ఏప్రిల్‌ మధ్య నుంచి కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ వ్యాప్తితో పలు రాష్ట్రాల్లో కొత్తగా లాక్‌డౌన్‌ విధించాల్సి రావడం కాస్త ప్రతికూల ప్రభావం చూపింది.

జూలైలో, మొదటిసారి ఈపీఎఫ్ఓ లో చేరిన వారు 6% పెరిగారు, తిరిగి చేరిన సభ్యులు సుమారు 9% పెరిగారు, నిష్క్రమించిన సభ్యులు మునుపటి నెలతో పోలిస్తే 36.84% తగ్గారు. ఈ ఏడాది జూలైలో 22-25 సంవత్సరాల వయస్సు గల వర్గాలు 3.88 లక్షల చేర్పులతో అత్యధిక సంఖ్యలో నికరంగా నమోదు చేసుకున్నాయని ఈపీఎఫ్ఓ​తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

LIC Jeevan Labh: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.230 పొదుపుతో రూ.17 లక్షలు.. పూర్తి వివరాలు..!

Gold Price: సెప్టెంబర్‌ 22 తర్వాత బంగారం ధరలు మరింతగా దిగిరానున్నాయా..? కారణం ఇదేనా..?

Loading...
Unable to load recommendations.
Follow Us