EPFO Subscribers: ఈపీఎఫ్‌ఓలో పెరుగుతున్న సబ్‌స్ర్కైబర్లు.. సెప్టెంబర్‌ 2021లో ఎంత మంది పెరిగారంటే..!

|

Nov 20, 2021 | 7:09 PM

EPFO Subscribers: ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌)కు సబ్‌స్ర్కైబర్లు పెరిగిపోతున్నారు. ఈపీఎఫ్‌ఓ తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం..ఈ ఏడాది..

EPFO Subscribers: ఈపీఎఫ్‌ఓలో పెరుగుతున్న సబ్‌స్ర్కైబర్లు.. సెప్టెంబర్‌ 2021లో ఎంత మంది పెరిగారంటే..!
Follow us on

EPFO Subscribers: ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌)కు సబ్‌స్ర్కైబర్లు పెరిగిపోతున్నారు. ఈపీఎఫ్‌ఓ తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం..ఈ ఏడాది సెప్టెంబర్‌ లో దాదాపు 15.41 లక్షల మంది చేరినట్లు వెల్లడించింది. ఇందులో దాదాపు 8.95 లక్షల మంది కొత్త సభ్యులు కాగా, దాదాపు 6.46 లక్షల మంది ఉద్యోగాలు మారడం ద్వారా ఈపీఓఫ్‌ఓలో చేరారు.సెప్టెంబర్‌లో 13.60 లక్షల మంది చందాదారుల సంఖ్య ఆగస్టుతో పోలిస్తే 1.81 లక్షలు పెరిగిందని నివేదిక పేర్కొంది.

22-25 సంవత్సరాల వయసు గలవారిలో అత్యధిక సంఖ్యలో నమోదు చేసుకున్నారు. సెప్టెంబర్‌లో దాదాపు 4.12 లక్షల మంది చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీని తర్వాత 18-21 మధ్య వయసున్న వారు దాదాపు 3.18 లక్షల మంది ఎన్‌రోల్‌మెంట్‌లలో ఉన్నారు. సెప్టెంబర్‌ 2021లో మొత్తం నికర చందాదారుల చేరికతో దాదాపు 47.39 శాతం వాటా చేరింది. ఇక మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఈనెలలో దాదాపు 9.41 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు చేరారు.

 

 

ఇవి కూడా చదవండి:

PM SVANidhi: వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకుంటే సులభంగా రుణాలు..!

EPFO e-Nomination: మీ ఈపీఎఫ్‌ ఖాతాకు నామినీ పేరు చేర్చలేదా..? రూ.7 లక్షలు రానట్లే..! పూర్తి వివరాలు