EPFO: ఈపీఎఫ్‌ఓలో భారీగా పెరుగుతోన్న ఖాతాదారుల సంఖ్య.. మార్చిలో కొత్తగా15.32 లక్షల మంది చేరిక..

|

May 21, 2022 | 4:24 PM

EPFOలో మార్చి 2022లో 15.32 లక్షల మంది చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 12.85 లక్షలుగా ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ శుక్రవారం నివేదిక విడుదల చేసింది...

EPFO: ఈపీఎఫ్‌ఓలో భారీగా పెరుగుతోన్న ఖాతాదారుల సంఖ్య.. మార్చిలో కొత్తగా15.32 లక్షల మంది చేరిక..
Epfo
Follow us on

EPFOలో మార్చి 2022లో 15.32 లక్షల మంది చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 12.85 లక్షలుగా ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ శుక్రవారం నివేదిక విడుదల చేసింది. సుమారు 9.68 లక్షల మంది కొత్త సభ్యులు(subscribers) మొదటిసారిగా EPF & MP చట్టం, 1952 నిబంధనల కింద సభ్యులయ్యారు. కొత్తగా చేరిన వారులో 22-25 సంవత్సరాల వయస్సు గలవారు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత 29-35 ఏళ్ల వయస్సు వారు 3.17 లక్షల మంది ఉన్నారు. 18-21 సంవత్సరాల వయస్సు గల వారు 2.93 లక్షల మంది కొత్తగా పీఎఫ్‌లో చేరారు. మహారాష్ట్ర(Maharastra), కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీ నుంచి సుమారు 10.14 లక్షల మంది పీఎఫ్‌ చందాదారులుగా నమోదు చేసుకున్నారు.

కొత్తగా పీఎఫ్‌లో చేరిన వారిలో మహిళలు 3.48 లక్షల మంది ఉన్నారు. మిగతా వారంతా పురుషులు ఉన్నారు. పరిశ్రమల వారీగా చూస్తే ప్రధానంగా రెండు కేటగిరీల నుంచి ఎక్కువ మంది పీఎఫ్‌లో చేరారు. ఇందులో మ్యాన్‌పవర్ ఏజెన్సీలు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల నుంచి దాదాపు 47.76 శాతం మంది చందాదారులుగా చేరారు. ఆ తర్వాత టెక్స్‌టైల్స్, హెవీ-ఫైన్ కెమికల్స్, హోటళ్లు & రెస్టారెంట్లు మొదలైన పరిశ్రమల్లో పని చేస్తున్నవారు ఉన్నారు. వ్యవస్థీకృత రంగ కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించేందుకు ఈ ఈపీఎఫ్‌ఓను ఏర్పాటు చేశారు. ఇది సభ్యులకు ప్రావిడెంట్ ఫండ్, బీమా, పెన్షన్‌తో సహా అనేక రకాల సేవలను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…