EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండుగలాంటి వార్త.. బ్యాంకింగ్ తరహాలో సేవలు.. దేశంలో ఎక్కడినుంచైనా..
ఈపీఎఫ్ సేవలను కేంద్రం వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధలను పూర్తిగా మార్చేసింది. కొత్త సిస్టమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. పీఎఫ్ సేవలను వేగంగా అందించేందుకు కొత్త పోర్టల్ కూడా తీసుకురానుంది. ఈ పోర్టల్‌తో అనేక మార్పులు పీఎఫ్ వ్యవస్థలో జరగనున్నాయి.

ఈపీఎఫ్‌వో సేవలను మరింత మెరుగపర్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పీఎఫ్ క్లెయియ్ ప్రాసెస్‌ను మరింత వేగవంతం చేసింది. దాదాపు దేశంలో 7 కోట్ల మందికిపైగా పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. వీరందరికీ సులభంగా, వేగంగా సేవలను అందించేందుకు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లను మెరుగుపర్చడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం త్వరలో ఈపీఎఫ్‌వో 3.0 సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెడీ అవుతోంది. ఈ కొత్త వ్యవస్ధ బ్యాంకింగ్ సేవల తరహాలో ఉంటుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్లను రియల్ టైమ్‌లో ప్రాసెస్ చేసినట్లే.. పీఎఫ్ సేవలను కూడా వేగంగా అందిస్తారు.
దేశంలో ఎక్కడైనా సేవలు పొందవచ్చు
గతంలో ఖాతాదారుడు పీఎఫ్ సేవలు పొందాలంటే తమ ఖాతా నమోదు చేయబడిన పరిధిలోని కార్యాలయంలోనే సంప్రదించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. పీఎఫ్ సభ్యుడు దేశంలోని ఏ పీఎఫ్ కార్యాలయంలో అయినా తమ సమస్యను పరిష్కరించుకోవ్చు. దీంతో ఉద్యోగులకు వేగంగా సహాయం అందనుంది.
ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే..
గతంలో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే క్లిష్టమైన ప్రక్రియ ఉండేది. ఆధారాలు అప్ లోడ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి పీఎఫ్ సొమ్ములో 75 శాతాన్ని ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఇక మిగతా 25 శాతాన్ని ఉద్యోగం మానేసిన తర్వాత లేదా ఉద్యోగం కోల్పోయాక తీసుకోవచ్చు. ఇక నుంచి పీఎఫ్ క్లెయిమ్స్ చేసే సమయంలో ఎలాంటి కాగితపు పని ఉండదు. ఎలాంటి పత్రాలు అప్ లోడ్ చేయాల్సిన పని ఉండదు. దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు క్లెయిమ్స్ వేగంగా పరిష్కారం అవుతాయి.
పెన్షన్ నిబంధనల్లో మార్పులు
ఇక పెన్షన్ నిబంధనల్లో కడా మార్పులు చోటుచేసుకున్నాయి. పెన్షన్ల ఉపసంహరణకు సంబంధించిన నియమాలను మార్చారు. రెండు నెలల తర్వాత పింఛన్ ఉపసంహరణకు అనుమతి ఉండగా.. ఇప్పుడు 36 నెలలకు మార్చారు. ఇక గతంలో పీఎఫ్ విత్ డ్రాకు 13 వేర్వేరు కేటగిరీలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని మూడుకు తగ్గించారు. అత్యవసర అవసరాలు, గృహ వసతి, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు కేటగిరీలు అందుబాటులో ఉంచారు. ఇక పీఎఫ్ క్లెయిమ్స్ అనేవి సిబ్బంది ప్రమేయం లేకుండా ఆటోమేషన్ విధానంలో జరుగుతాయి. ఇంతకముందు సిబ్బంది పరిశీలించి క్లెయిమ్‌కు అనుమతి ఇచ్చేవారు. కానీ కొత్త విధానంలో ఖాతాదరుడు క్లెయిమ్ కోసం రిక్వెస్ట్ పెట్టగానే ఆటోమేషన్ పద్దతిలో జరుగుతుంది. దీని వల్ల క్లెయిమ్ వేగంగా ప్రాసెస్ చేయబడుతుంది.
