Tax Evasion: చైనా కంపెనీకి షాక్ ఇచ్చిన ఈడీ అధికారులు.. పన్ను ఎగవేతపై చర్యలు..!

Tax Evasion: చైనా మెుబైల్ దిగ్గజానికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. కంపెనీ కస్టమ్స్ సుంకం ఎగవేతకు పాల్పడినట్లు తేలింది. దీంతో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్​ మను కుమార్ జైన్​కు నోటీసులు జారీ చేసింది.

Tax Evasion: చైనా కంపెనీకి షాక్ ఇచ్చిన ఈడీ అధికారులు.. పన్ను ఎగవేతపై చర్యలు..!
Tax
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 14, 2022 | 2:10 PM

Tax Evasion: చైనా మొబైల్ తయారీ సంస్థ షావోమీ(Xiaomi) గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్​ మను కుమార్ జైన్​కు బెంగళూరులోని ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. విదేశీ మారకపు చట్టం(Money laundering) ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఈడీ ఆయనను ప్రశ్నించనున్నారు. గత కొన్నేళ్లుగా సంస్థ స్వీకరించిన విదేశీ చెల్లింపుల విషయంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో కంపెనీకి చెందిన ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్ అధికారులను ఈడీ విచారిస్తోంది.

వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని లేదా అధికారిక ప్రతినిధిని పంపించాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆదేశించింది. షావోమీ షేర్​హోల్డింగ్స్, కాంట్రాక్టులు సహా నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలు అందించాలని నోటీసులో కోరింది. సంస్థ ఇండియా కార్యాలయానికి వచ్చిన చెల్లింపులు, విదేశాలకు సంస్థ చేసిన చెల్లింపుల లావాదేవీలను తెలపాలని స్పష్టం చేసింది. గతంలో షావోమీ ఇండియా హెడ్​గా మను కుమార్.. ఇటీవలే గ్లోబల్ హెడ్ బాధ్యతలు చేపట్టారు. ఈడీ నోటీసులకు స్పందించిన సంస్థ ప్రతినిధి.. భారతీయ చట్టాలను గౌరవిస్తామని వెల్లడించారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. నోటీసుల్లో అడిగిన వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

కంపెనీపై ఆరోపణలు ఏంటంటే..

షావోమీ కంపెనీపై ఇంతకు ముందు పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీతో పాటు మరికొన్ని చైనా మొబైల్ తయారీ సంస్థలపైనా ఆదాయ పన్ను శాఖ 2021 డిసెంబర్​లో దాడులు చేసింది. రూ.653 కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగవేత ఆరోపణలతో ఆ సంస్థకు కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు జారీ చేసింది. షావోమీ ఇండియాకు చెందిన ప్రాంగణాల్లో జరిపిన సోదాల్లో.. దిగుమతి సుంకం ఎగవేతకు సంబంధించిన కీలక పత్రాలను డైరెక్టర్ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్​ఐ)​ స్వాధీనం చేసుకుంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Economic crisis: శ్రీలంకను మించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ మూడు దేశాలు.. ఎందుకంటే..

Maternity Insurance: మెటర్నిటీ ఖర్చుల కోసం ఇన్సూరెన్స్ చేసుకోండి.. పూర్తి వివరాలు..

MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..