340 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుడు అనే ట్యాగ్ లైన్ ను ఎలన్ మస్క్ మిస్ చేసుకున్నాడు. అతని ర్యాంక్ రెండో స్థానానికి చేరింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఇప్పుడు ప్రపంచ కుబేరుడిగా నిలిచాడు. బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం ఎలన్ మస్క్ సంపద ఈ ఏడాది జనవరి తర్వాత 168.5 బిలియన్ల డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 172.9 బిలియన్లకు చేరింది. ఈయన సంపదలో 48 శాతం ఫ్యాషన్ దిగ్గజం ఎల్ ఎం వీహెచ్ నుంచి వచ్చింది. 2021 ఏప్రిల్ లో 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేస్తానని ప్రకటించడంతో ప్రపంచ వ్యాపార దిగ్గజాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ డీల్ నుంచి బయటకు రావడానికి మస్క్ ఎంతలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
టెస్లా వంటి సంస్థల విలువ తగ్గడం మస్క్ రేటింగ్ పై ప్రభావం చూపాయి. మస్క్ టెస్లా షేర్లలో 15 బిలియన్ డాలర్లు పై ఆఫ్ లోడ్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో సుమారు 8.9 బిలియన్ డాలర్లు, ఆగస్టులో మరో 6.9 డాలర్లను ఆఫ్ లోడ్ చేశాడు. ఎప్పుడైతే అక్టోబర్ లో ట్విట్టర్ కొనుగోలు మస్క్ ఫైనల్ చేశాడో అతని వ్యాపారాలకు సంబంధించిన షేర్లు క్షీణించాయి. ట్విట్టర్ మొత్తం 2021 సంవత్సరానికి చెందిన వార్షిక వడ్డీ ఖర్చులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది. దీంతో బ్యాంకర్లు మస్క్ ట్విట్టర్ లో లేయర్ చేసిన అధిక-వడ్డీ రుణాన్ని భర్తీ చేయడానికి టెస్లా స్టాక్ మద్దతుతో కొత్త మార్జిన్ రుణాలను అందించాలని ఆలోచిస్తున్నారని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.
ఆర్నాల్ట్ చాలా కాలంగా సంపద ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. సంపన్నులకు డిజైనర్ వేర్ అందించే ఎల్ వీఎంహెచ్ కు ఇతనే అధిపతి. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో కోవిడ్ నిబంధనలు సడలించడం షాపింగ్, ప్రయాణ ఆంక్షలు ఎత్తివేయడంతో అతని కంపెనీలు లాభపడడంతో రేటింగ్స్ లో ముందుకు దూసుకొచ్చాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి