Car Mileage Tips: మీ కారు మంచి మైలేజీని ఇవ్వడం లేదా?.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..

చాలా మంది తమ కారు మైలేజ్ తగ్గుతుందని నిరంతరం ఫిర్యాదు చేస్తుంటారు. ప్రతి కారు యజమాని తన కారు గొప్ప మైలేజీని ఇవ్వాలని కోరుకుంటాడు. అయితే, ఇది ఎల్లప్పుడూ సాధ్యమవుతుందంటే..

Car Mileage Tips: మీ కారు మంచి మైలేజీని ఇవ్వడం లేదా?.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
Car
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 14, 2022 | 3:44 PM

చాలా మంది తమ కారు మైలేజ్ తగ్గుతుందని ఆందోళన చెందుతుంటారు. ప్రతి కారు యజమాని తన కారు గొప్ప మైలేజీని ఇవ్వాలని కోరుకుంటాడు. అయితే, ఇది అన్ని సమయాల్లో సాధ్యం కాదు. కొన్నిసార్లు కారు తక్కువ మైలేజీని ఇస్తుంది. దీంతో కారు నడపడానికి అయ్యే ఖర్చు పెరుగుతుంది. అందువల్ల, మీరు కారు మైలేజీని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇవాళ మనం నిత్యం మనకు ఎదురయ్యే ఈ మైలేజ్ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఇందులో అత్యంత ముఖ్యమైనది.. కారును సమయానికి సర్వీస్ చేయడం. కారు సమయానికి సర్వీస్ చేయకపోతే.. అది మనం అత్యంత ముఖ్యమైన పనిపై వెళ్తున్నప్పుడు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి, మీ కారు తక్కువ మైలేజీని ఇస్తుంటే.. ముందుగా సర్వీస్ చేయించాలని గుర్తు పెట్టుకోండి. సర్వీస్ చేస్తే మాత్రమే కారు సరైన పద్దతిలో మైలేజ్ ఇస్తుంది.

వీటిని చెక్ చేయించండి..

కారు పనితీరుకు రెగ్యులర్ సర్వీస్ అవసరం. ఇది మంచి మైలేజ్‌ ఇవ్వడానికి సహాయపడుతుంది. క్లీన్ ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్ మీ కారు ఇంధన మైలేజీని పెంచుతాయి. ఒకవేళ ఎయిర్ ఫిల్టర్ సరిగ్గా లేకుంటే ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుందని గుర్తుంచుకోండి.

టైర్లలో గాలి..

టైర్లలో గాలి సరిపడేంత ఉందా..? లేదో చెక్ చెయించుకోవడం చాలా అవసరం. కారు మైలేజీకి దోహదం చేస్తుంది. కారు టైర్‌కు సరైన గాలి లేకపోతే.. అది మైలేజీపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, కారు నుంచి మంచి మైలేజ్ కావాలంటే టైర్లు సరైన స్థాయిలో ఎయిర్ ప్రెజర్ ఉండేలా చూసుకోండి. అన్ని టైర్లలో గాలి పీడనం సరిగ్గా ఉందో లేదో బయలుదేరే ముందే చూసుకోవాలి. టైర్లలో నిర్దేశిత మోతాదు కన్నా తక్కువ గాలి ఉన్నట్లయితే, రన్నింగ్ లోడ్ పెరిగి మైలేజ్ భారీగా తగ్గిపోయే ఆస్కారం ఉంది.

ఆ తర్వాతే ఇంజిన్‌ను ఆపివేయండి

ట్రాఫిక్‌లో ఎక్కువగా ఉండే ప్రదేశంలో మీరు కారు డ్రైవ్ చేస్తున్నట్లైతే.. సిగ్నల్ పడిన వెంటనే ఇంజన్ ఆపేయండి. రోడ్డు పక్కన షాపింగ్ చేస్తున్న సమయంలో కూడా కారును పార్కింగ్ ప్లేస్‌లో పెట్టి.. షాపింగ్ చేయండి. ఎందుకంటే కారు ఆన్‌లో ఉండగా షాపింగ్ చేయడం వల్ల మైలెజ్ తగ్గిపోతుంది.

క్రూయిజ్ నియంత్రణ 

మీరు లాంగ్ డ్రైవ్‌ కోసం వెళ్తున్నప్పుడు మీరు క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించవచ్చు. అయితే, మీరు ప్రయాణించే రహదారిపై క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించవచ్చో లేదో గుర్తుంచుకోండి. ఉపయోగించగలిగితే అలా చేయండి. ఇది మీకు ఎక్కువ మైలేజీని ఇవ్వడంలో సహాయపడుతుంది.

తెలివిగా డ్రైవ్ చేయటం

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వివేకంతో డ్రైవ్ చేయండి. మితిమీరిన వేగం, అనవసరమైన యాక్సిలరేషన్, అసందర్భ బ్రేకింగ్‌లను తగ్గించుకోగలిగినట్లయితే.. ఇంధన వినియోగం తగ్గి మైలేజ్ పెరుగుతుంది. హైవేలపై ఎక్కువ వేగంతో వెళ్లటం వలన సుమారు 30 శాతానికి పైగా మైలేజ్‌ను కోల్పోవటం జరుగుతుంది. అలాగే, ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో అనవసరంగా బ్రేకులు వేయడం.. యాక్సిలరేషన్ కారణంగా సుమారు 5 శాతం మైలేజ్‌ తగ్గడం జరుగుతుంది.

ACని పొదుపుగా వాడండి

చలికాలంలో కూడా కొందరు కారులో ఏసీ పెట్టుకుని ప్రయాణిస్తుంటారు. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిత్యం ఏసీ ఆన్‌లో ఉంటే మైలేజీ దెబ్బతింటుంది. మీరు ఈ అలవాటును వెంటనే మార్చుకోండి. ఎందుకంటే AC రన్ చేయడం వల్ల కారు మైలేజీని 30 శాతం వరకు తగ్గుతుంది. ఫుల్ ట్యాంక్ ఇంధనంతో AC ఆన్‌లో పెట్టుకొని 500 కి.మీ ప్రయాణిస్తే AC ఆఫ్ చేయడం ద్వారా 600 నుంచి 625 కి.మీ ప్రయాణించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే