Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ బిగ్ షాక్.. 50 కంపెనీలపై సోదాలు..

రిలయన్స్ అనిల్ అంబానీ కంపెనీలపై ఈడీ దాడులు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై అనిల్ కంపెనీలపై కేసులు నమోదయ్యాయి. మరి ఈడీ ప్రాథమిక విచారణలో ఏం తేలింది..? దాడుల్లో బయటపడ్డ ఆధారాలేంటి.? విచారణలో తదుపరి పరిణామాలు రిలయన్స్ గ్రూప్‌పై గణనీయమైన ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ బిగ్ షాక్.. 50 కంపెనీలపై సోదాలు..
Anil Ambani

Updated on: Jul 25, 2025 | 10:22 AM

అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలపై మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ మెరుపు దాడులు చేసింది. ముంబై, ఢిల్లీలలోని 35 ప్రాంతాల్లో, 50కి పైగా సంస్థల్లో దాడులు నిర్వహించింది. 25 మంది వ్యక్తుల ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 17 కింద ఈడీ సోదాలు చేసింది. 2017-2019 మధ్య యస్ బ్యాంక్ నుంచి రూ.3వేల కోట్ల రుణాలు తీసుకుని దారి మళ్లించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. సీబీఐ నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లతో పాటు సెబీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ నుంచి అందిన సమాచారం ఆధారంగా దాడులు జరిగాయి.

ఈడీ ప్రాథమిక విచారణలో యస్ బ్యాంక్ రుణాల ప్రక్రియలో తీవ్రమైన ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు తేలింది. ఆర్థికంగా బలహీనమైన సంస్థలకు రుణాలు ఇవ్వడం, సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం, ఒకే చిరునామా, డైరెక్టర్లతో బహుళ సంస్థలు, షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు, లోన్ ఎవర్‌గ్రీనింగ్ వంటి అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.

2018లో 3వేల742కోట్ల రూపాయలు ఉన్న రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కార్పొరేట్ రుణాలు 2019నాటికి 8వేల 670 కోట్లకు పెరగడం సెబీ దృష్టికి వచ్చింది. ఈ రుణాలకు ముందు యస్ బ్యాంక్ ప్రమోటర్ల ఖాతాలకు నిధులు బదిలీ అయినట్లు ఈడీ అనుమానిస్తోంది, ఇది క్విడ్ ప్రో క్వో ఒప్పందం కింద జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. విచారణలో తదుపరి పరిణామాలు రిలయన్స్ గ్రూప్‌పై గణనీయమైన ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…