Snapdeal IPO: ఐపీఓకు దరఖాస్తు చేసిన స్నాప్‌డీల్.. రూ. 1,250 కోట్ల సేకరణే లక్ష్యం..

|

Dec 22, 2021 | 9:59 PM

సాఫ్ట్‌బ్యాంకు మద్దతుగల దేశీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం స్నాప్‌డీల్ బుధవారం ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్-ఐపీఓ’ కోసం దరఖాస్తు చేసుకుంది.

Snapdeal IPO: ఐపీఓకు దరఖాస్తు చేసిన స్నాప్‌డీల్.. రూ. 1,250 కోట్ల సేకరణే లక్ష్యం..
Fixed Deposits Vs Ipo Investment
Follow us on

సాఫ్ట్‌బ్యాంకు మద్దతుగల దేశీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం స్నాప్‌డీల్ బుధవారం ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్-ఐపీఓ’ కోసం దరఖాస్తు చేసుకుంది. సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు ఉన్న అనేక కంపెనీలు ఇటీవల ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. పేటిఎం, బ్యూటీ ఈ-కామర్స్ రిటైలర్ నైకా, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారం జొమాటో వంటి సంస్థలు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టి మంచి లిస్టింగ్ గెయిన్స్‎ను సాధించాయి. అయితే పేటిఎం లిస్టింగ్ గెయిన్స్‌ను పొందనప్పటికీ తరువాత పెరుగుతూ వస్తోంది.

డిసెంబర్ 20 నాటి డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ప్రకారం, స్నాప్‌డీల్ ఐపీఓ ద్వారా ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 1,250 కోట్లు విలువ చేసే షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 308 లక్షల షేర్లను విక్రయించనున్నట్లు సమాచారం. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం స్నాప్‌డీల్‌ను 2010 సంవత్సరంలో కునాల్, రోహిత్ బన్సల్ కలిసి ప్రారంభించారు. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పెద్ద ప్రత్యర్థులతో బిజినెస్ పరంగా స్నాప్‌డీల్‌ పోటీపడుతోంది.

స్నాప్‌డీల్ టేబుల్ మ్యాట్‌లు, టమ్మీ ట్రిమ్మర్లు, గడ్డం గ్రూమింగ్ ఆయిల్‌లు, ఫ్లీస్ బ్లాంకెట్‌లను 5 డాలర్లలోపు విక్రయిస్తుంది. ఇటీవలి పండుగ సీజన్‌లో, Snapdeal విక్రయాల వాల్యూమ్‌లు ఫ్యాషన్ విభాగంలో 254%, కిచెన్ విభాగంలో 101%, బ్యూటీ విభాగంలో 93% పెరిగాయని కంపెనీ నవంబర్ ప్రకటించింది.

Read Also.. Multibagger Stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. సంవత్సరంలో రూ. 44 లక్షలు అయ్యాయి..