Earned Leave Encashment: మీరు ఉద్యోగం మానేయబోతున్నట్లయితే మిగిలిన సెలవులకు డబ్బు ఎలా పొందాలో తెలుసా?

|

Dec 10, 2022 | 10:16 AM

మీరు కంపెనీలో పని చేస్తున్నట్లయితే మీకు కంపెనీ నుండి కొన్ని సెలవులు ఉంటాయి. ఇందులో కొన్ని సెలవులు ఉద్యోగి వాడకపోతే ఆ సెలవులకు బదులుగా డబ్బు అందిస్తారు..

Earned Leave Encashment: మీరు ఉద్యోగం మానేయబోతున్నట్లయితే మిగిలిన సెలవులకు డబ్బు ఎలా పొందాలో తెలుసా?
Follow us on

మీరు కంపెనీలో పని చేస్తున్నట్లయితే మీకు కంపెనీ నుండి కొన్ని సెలవులు ఉంటాయి. ఇందులో కొన్ని సెలవులు ఉద్యోగి వాడకపోతే ఆ సెలవులకు బదులుగా డబ్బు అందిస్తారు. దీనినే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అంటారు. కార్యాలయ హెచ్‌ఆర్‌ ఈ విషయాన్ని ఉద్యోగులకు సమాచారం అందిస్తుంటాయి. ఒక సంవత్సరంలో వారికి ఎన్ని సెలవులు వస్తాయి? వారు ఎంత సొమ్ము చేసుకోవచ్చు. మీ సెలవుల గురించిన పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి.

వ్యవస్థీకృత రంగ సంస్థలు తమ ఉద్యోగులకు అనేక రకాల సెలవులు ఇస్తాయి. వీటిలో సిక్ లీవ్, క్యాజువల్ లీవ్, ఎర్న్డ్ లీవ్, ప్రివిలేజ్ లీవ్ ఉంటాయి. వీటిలో మీరు క్యాలెండర్ సంవత్సరంలో అనారోగ్య, సాధారణ సెలవులను ఉపయోగించకపోతే మళ్లి తిరిగి రావు. కానీ ఎర్న్డ్ లీవ్, ప్రివిలేజ్ లీవ్‌లకు బదులుగా డబ్బు తీసుకోవచ్చు. మీరు వాటిని ఎన్‌క్యాష్ చేయవచ్చు. ప్రతి కంపెనీ వీటికి తన స్వంత నిబంధనలు, షరతులను సెట్ చేయవచ్చు.

సాధారణంగా ఏ కంపెనీలోనైనా సంవత్సరానికి గరిష్టంగా 30 సెలవులను ఎన్‌క్యాష్ చేయాలనే నియమం ఉంది. ప్రభుత్వం ఏటా గరిష్టంగా 30 సెలవుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు ఇస్తుంది. అయితే ఈ సందర్భంలో కంపెనీ నియమాలు కూడా భిన్నంగా ఉండవచ్చు. కొన్ని కంపెనీలలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సంవత్సరం పూర్తయిన తర్వాత మాత్రమే జరుగుతుంది. కొన్ని కంపెనీలు ఉద్యోగి రాజీనామా చేసిన తర్వాత పూర్తిగా, ఫైనల్‌గా లీవ్ డబ్బును ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి