AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారిన వీసా నిబంధనలు.. ఇక వాళ్లు కూడా దుబాయ్‌లో ఇళ్లు కొనుగోలు చేయొచ్చు!

దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి వీసా నిబంధనలను సడలించింది. ఇకపై, చిన్న పెట్టుబడిదారులు కూడా అక్కడ ఆస్తి కొనుగోలు ద్వారా నివాస వీసాలను పొందగలరు. రెండేళ్ల వీసా కోసం ఉన్న కనీస ఆస్తి విలువ నిబంధనను తొలగించారు. ఉమ్మడి ఆస్తులలో ప్రతి పెట్టుబడిదారుడికి కనీసం AED 400,000 వాటా ఉండాలి.

మారిన వీసా నిబంధనలు.. ఇక వాళ్లు కూడా దుబాయ్‌లో ఇళ్లు కొనుగోలు చేయొచ్చు!
Dubai
SN Pasha
|

Updated on: Apr 30, 2026 | 3:40 PM

Share

మధ్యప్రాచ్యంలోని ప్రముఖ వ్యాపార కేంద్రం దుబాయ్‌ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చిన్న పెట్టుబడిదారులు కూడా అక్కడ ఆస్తులు కొనుగోలు చేసి నివాస వీసాలను పొందే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం ద్వారా మధ్య-ఆదాయ వర్గాలు, విదేశీ పెట్టుబడిదారులకు మార్కెట్ మరింత అందుబాటులోకి రానుంది. కొత్త నిబంధనల ప్రకారం రెండేళ్ల ప్రాపర్టీ-లింక్డ్ రెసిడెన్సీ వీసా కోసం ఉన్న కనీస ఆస్తి విలువ పరిమితిని ప్రభుత్వం తొలగించింది. గతంలో పెట్టుబడిదారులు కనీసం AED 750,000 (దాదాపు రూ.1.9 కోట్లు) విలువైన ఆస్తిని కొనుగోలు చేయాల్సి ఉండేది. ఈ నిబంధన చిన్న పెట్టుబడిదారులకు అడ్డంకిగా మారింది. ఇప్పుడు ఆ పరిమితిని తీసివేయడంతో మార్కెట్లోకి కొత్త కొనుగోలుదారులు ప్రవేశించే అవకాశం పెరిగింది.

అయితే ఉమ్మడి ఆస్తుల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. ఒక ఆస్తిలో ఒకటి కంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఉంటే, ప్రతి ఒక్కరి వాటా కనీసం AED 400,000 (సుమారు రూ.1.03 కోట్లు) ఉండాలి. గతంలో ఈ పరిమితి AED 750,000గా ఉండేది. ఈ మార్పు చిన్న పెట్టుబడిదారులకు అవకాశాలు కల్పించడమే కాకుండా, వీసా ప్రయోజనాల దుర్వినియోగాన్ని కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రాంతీయ అనిశ్చితులు ముఖ్యంగా స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవలి కాలంలో ఆస్తి అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో, డెవలపర్లు కొత్త ఆఫర్లు, సౌకర్యవంతమైన చెల్లింపు పద్ధతులను అందిస్తున్నారు. గణాంకాల ప్రకారం 2025లో దుబాయ్‌లో నివాస గృహాల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకుని మొత్తం AED 547 బిలియన్ల విలువ నమోదు చేశాయి. ఇందులో భారతదేశం, యూకే వంటి దేశాల పెట్టుబడిదారుల పాత్ర గణనీయంగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కొత్త విధానం మార్కెట్‌లో సమతుల్యతను తీసుకురావడంతో పాటు, మరింత విస్తృత పెట్టుబడిదారుల వర్గాన్ని ఆకర్షించగలదు. దీంతో దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ వృద్ధి దిశగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us