AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకుంటున్నారా..? సర్వీస్ ఛార్జీలపై కేంద్రం బిగ్ అప్డేట్..

ఆధార్ అప్డేట్ కోసం యూఐడీఏఐ అనేక సర్వీస్ ఛార్జీలను ప్రకటించింది. సర్వీస్ ఛార్జీలకు సంబంధించి మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆధార్ సెంటర్ల వద్ద ఎక్కువ కట్టవద్దని, నిర్ణయించిన ధరలను మాత్రమే చెల్లించాలని సూచించింది. ఆధార్ సేవలను పొందే సమయంలో ధరలను చెక్ చేసుకోవాలని తెలిపింది.

Aadhaar Card: ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకుంటున్నారా..? సర్వీస్ ఛార్జీలపై కేంద్రం బిగ్ అప్డేట్..
Aadhaar
Venkatrao Lella
|

Updated on: Apr 30, 2026 | 3:12 PM

Share

ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ విషయంలో యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డు అప్డేట్ సర్వీస్ ఛార్జీలపై కీలక ప్రకటన చేసింది. ఆధార్ సర్వీసులను పొందే ముందు సర్వీస్ ఛార్జీల గురించి తెలుసుకోవాలని, అపరేటర్‌కు ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించవద్దని సూచించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఆధార్ సర్వీస్ ఛార్జీల వివరాలను యూఐడీఏఐ వివరించింది. ఏ సర్వీస్‌కు ఎంత ఛార్జీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం.

ఆధార్ సర్వీస్ ఛార్జీలు

-ఆధార్ కార్డు ఎన్‌రోల్‌మెంట్ అనేది పూర్తిగా ఉచితం

బయోమెట్రిక్స్(ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫొటో) అప్డేట్‌కు సంబంధించి ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు తొలిసారి అప్డేట్ చేయించుకుంటే ఉచితం

-ఇక 15 నుంచి 17 సంవత్సరాల వయస్సులో తొలిసారి లేదా రెండోసారి అప్డేట్ చేయించుకున్నా ఉచితమే

-ఏడు నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సులో చేయించుకునేవారు సెప్టెంబర్ 30,2026 వరకు ఉచితంగా చేయించుకోవచ్చు. ఆ తర్వాత బయోమెట్రిక్స్ అప్డేట్‌ కోసం రూ.125 చెల్లించాలి

-డెమోగ్రాఫిక్స్ అయిన పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ లాంటివి బయోమెట్రిక్స్‌తో పాటు అప్డేట్ చేయించుకుంటే ఉచితమే

-ఇక డెమోగ్రాఫిక్స్ ప్రత్యేకంగా అప్డేట్ చేయించుకోవాలంటే రూ.75 సర్వీస్ ఛార్జీ ఉంటుంది

-పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అప్డేట్ చేసుకునేందుకు ధృవీకరణ కోసం గుర్తింపు పత్రాలు సబ్మిట్ చేసేందుకు ఆధార్ సెంటర్లలో అయితే రూ.75 చెల్లించాలి. అదే యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా మనం చేసుకుంటే ఈ ఏడాది జూన్ 14 వరకు ఉచితంగా చేసుకోవచ్చు

-5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవచ్చు

పీవీసీ కార్డ్ కోసం..

ఇక ఆధార్ పీవీసీ కార్డు కావాలంటే రూ.75 చెల్లించి యూఐడీఏఐ వెబ్ సైట్ లేదా ఎంఆధార్ యాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. క్రెడిట్ కార్డు తరహాలోనే ఈ కార్డు అనేది ఉంటుంది. మెరుగైన భద్రతా ప్రమాణాలతో ఇది ఉంటుంది. పాలీవినైల్ క్లోరైడ్‌తో వీటిని తయారుచేస్తారు. ప్రస్తుత ఉన్న పేపర్ ఆధార్ కార్డులు చినిగిపోయే అవకాశముంటుంది. అయితే పీవీసీ కార్డులకు అలాంటి సమస్య అనేది ఉండదు. దీంతో చాలామంది ఈ కార్డుల కోసం ఆర్డర్ పెట్టుకున్నారు. గతంలో రూ.25కే పీవీసీ కార్డ్ పొందే సౌకర్యం ఉండగా.. ఇప్పుడు యూఐడీఏఐ ధరను పెంచింది. అయినా చాలామంది ఈ కార్డు కోసం ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఈ కార్డు వల్ల అనేక లాభాలు ఉండటంతో చాలామంది తీసుకుంటున్నారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర