చెక్ బౌన్స్.. మన CIBIL స్కోర్‌పై ప్రభావం చూపుతుందా?.. నిజం ఏంటి?.. ఇక్కడ తెలుసుకోండి!
మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే.. మన దగ్గర క్యాష్ లేక పోతే.. అప్పుడు మనం యూపీఐను ఉపయోగించడమో, లేదా చెక్ రాసివ్వడం వంటివి చేస్తుంటా.. కానీ చెక్‌లో ఏవైనా తప్పులు రాసినా, మన అకౌంట్‌లో సరిపడా డబ్బులు లేకపోయినా ఆ చెక్ చెల్లుబాటు కాదు.. అలాంటి సందర్భాన్ని చెక్ బౌన్స్ అంటారు. అయితే ఈ చెక్ బౌన్స్‌లు.. మన CIBIL స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని చాలా మంది నమ్ముతారు, కానీ అది నిజమేనా?.. ఇందులో ఎంత వరకు నిజం ఉంది. ఇంతకు నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

బౌన్స్ అయిన చెక్ మీ CIBIL స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని చాలా మంది నమ్ముతారు. మీ క్రెడిట్ హిస్ట్రిని ట్రాక్ చేసినప్పుడు, బ్యాంక్ లేదా ఏదైనా ఇతర ఆర్థిక సంస్థ క్రెడిట్ బ్యూరోకు మన డేటాను అందిస్తుంది, కానీ చెక్ బౌన్స్ అయినప్పుడు, లావాదేవీ ప్రైవేట్‌గా జరుగుతాయి. అలాంటి సందర్భంలో, క్రెడిట్ బ్యూరో మన క్రెడిట్ హిస్టరీని పొందదు. దీని వల్ల మన క్రెడిట్ స్కోర్‌పపై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. కానీ కొన్ని సార్లు మనం క్రెడిట్ కార్డు ఈఎంఐలు చెక్కుల ద్వారా చెల్లిస్తుంటాం. అలాంటప్పుడు చెక్ బైన్స్ అయితే మన క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ కావచ్చి కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చెక్ బౌన్స్ CIBIL స్కోర్‌ను ప్రభావితం చేస్తుందా?
సాధరణంగా బౌన్స్ అయిన చెక్కులు CIBIL స్కోర్‌ను ప్రభావితం చేయవు. ఎందుకంటే మీ క్రెడిట్ హిస్టరీని ట్రాక్ చేసినప్పుడు, బ్యాంక్ లేదా ఏదైనా ఇతర ఆర్థిక సంస్థ క్రెడిట్ బ్యూరోలకు డేటాను అందిస్తుంది. కానీ చెక్ బౌన్స్ అయితే, లావాదేవీ ప్రైవేట్‌గా జరుగుతాయి, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే ఈ వ్యవహారం జరుగుతుంది. అలాంటి సందర్భంలో, క్రెడిట్ బ్యూరోలకు మన క్రెడిట్ హిస్టరీ వెళ్లదు..ఈ కారణంగా CIBIL స్కోర్‌పై ఎటువంటి ప్రభావం చూపదు.
‘ఈ’ చెక్ బౌన్స్ సందర్భాలలో CIBIL స్కోర్‌పై ప్రభావం
మీరు మీ EMI లేదా క్రెడిట్ కార్డ్ బిల్లును చెక్కు ద్వారా చెల్లించినప్పుడు మీ చెక్కు కనుక బౌన్స్ అయితే, అటువంటి పరిస్థితిలో మీ CIBIL స్కోరుపై ఏదైనా ఎఫెక్ట్ పడవచ్చు. ఎందుకంటే అప్పుడు డిఫాల్ట్‌గా మన క్రెడిట్ హిస్టరీ క్రెడిట్ బ్యూరోలకు వెళ్తుంది. దీంతో మన CIBIL స్కోర్‌పై ఎఫెక్ట్ పడుతుంది.
పదేపదే చెక్ బౌన్స్ కావడం..
మీ చెక్కులు పదే పదే బౌన్స్ అవ్వడం కూడా మీ CIBIL స్కోర్‌ను ప్రభావితం చేయవచ్చు. మీ చెక్కు పదే పదే బౌన్స్ అయితే, బ్యాంక్ మిమ్మల్ని బాధ్యతారహిత కస్టమర్‌గా పరిగణిస్తుంది. అందువల్ల, మీరు భవిష్యత్తులో లోన్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, మీ లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మీ CIBIL స్కోర్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




