AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: దీపావళి నాటికి జీఎస్టీలో మార్పులు.. మధ్యతరగతి జీవులకు ఊరట

ఉందిలే మంచికాలం ముందు ముందునా...అంటూ మన ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 15న జెండా ఎగురవేస్తూ 143కోట్లమంది భారతీయులకు ఓశుభవార్త చెప్పారు. అందులో ఒకటి జీఎస్టీ స్లాబ్స్. జీఎస్టీపై ఆగస్టు 15 టీజర్ రిలీజ్ చేసిన ప్రధాని, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకూ ట్రైలర్‌లో ఏముంది..? దీపావళి నాటికి చూపించబోయే సినిమా మధ్యతరగతిజీవులకు ఎలా ఊరటనివ్వబోతోంది..?

GST: దీపావళి నాటికి జీఎస్టీలో మార్పులు.. మధ్యతరగతి జీవులకు ఊరట
GST
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2025 | 9:51 PM

Share

కేంద్రం ప్రతిపాదించిన కొత్త జీఎస్టీ స్లాబ్స్‌కు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఓకే చెప్పింది. ఇక దీపావళి నాటికి సామాన్యుడిని అలరించేలా జీఎస్టీ స్లాబ్స్ ఉండబోతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదముద్ర పడటమే తరువాయి, కొత్త స్లాబ్స్‌తో సామాన్యులకు భారీ ఊరట లభిస్తుందని కేంద్రం తీపికబురు చెప్పింది.

కొత్త ప్రతిపాదనల ప్రకారం ఇప్పటివరకు ఉన్న 12, 28 శాతం పన్ను శ్లాబులు ఇకపై ఉండవు. ఈ శ్లాబుల్లో ఉన్న వస్తువులను మిగిలిన శ్లాబుల్లో కలుపుతారు. ఇప్పటివరకు ఈ శ్లాబుల్లో ఉన్న వాటిని ఏ స్లాబ్‌లకు మార్చాలో కసరత్తు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి, MSMEలు, వ్యవసాయ రంగానికి పన్ను భారాన్ని తగ్గించడం కోసం GSTలో సంస్కరణలు తెస్తున్నట్టు కేంద్రం చెప్తోంది. అయితే హానికరమైన వస్తువులపై 40% ప్రత్యేక పన్నుపోటు తప్పదు. ప్రస్తుతం 12% శ్లాబులో ఉన్న 99% వస్తువులన్నీ 5% శ్లాబులోకి మారుతాయి. 28% శ్లాబులో ఉన్న 90% రకాల వస్తువులు, 18% శ్లాబులోకి మారబోతున్నాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం రెండే రెండు స్లాబ్‌లు.. 5శాతం, 18శాతం మాత్రమే ఉండబోతున్నాయి. 5శాతం కిందకు బటర్, ఘీ, చీజ్, మొబైల్ ఫోన్లు, ఫ్రూట్ జ్యూస్, గొడుగుల , ఆల్మండ్స్, మెడిసిన్స్ ప్రాసెస్డ్ ఫుడ్, క్యూమ్ క్లీనర్లు, చిన్న కార్లు, ప్రీమియం మోటర్ సైకిల్స్ లాంటివి ఉండగా.. 18శాతం కిందకు ఎయిర్ కండిషనర్లు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, టెలివిజన్లు, సిమెంట్, పెయింట్లు, చిన్న కార్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు,  సోప్, టూత్ పేస్ట్, ప్రింటెడ్ మెటీరియల్, ప్యాకింగ్ కంటైనర్లు ఉండే అవకాశం ఉంది. ఇక 40శాతం కిందకు సిగరెట్లు, టొబాకో, పాన్ మసాలా, లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలు, హై-ఎండ్ కార్లు, ఆన్‌లైన్ గేమింగ్, హై-వాల్యూ ఆటోమొబైల్స్ ఉండబోతున్నాయి.

ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అంశం. హెల్త్ ఇన్సూరెన్స్ . దేశీయంగా బీమా మార్కెట్‌ను విస్తరించడంతోపాటు.. పెట్టుబడుల కోసం ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలోభాగంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ GST నుంచి మినహాయించాలని ప్రతిపాదనలు చేసింది. దీంతో జీవిత, ఆరోగ్యబీమా ప్రీమియం తగ్గొచ్చని వినియోగదారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉన్నా.. పూర్తిగా జీఎస్టీ మేరకు తగ్గే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్‌ ప్రీమియంపై 18శాతం జీఎస్టీ చెల్లిస్తున్నాం. అయితే కొత్త ప్రతిపాదనల ప్రకారం.. 15శాతం వరకు బీమా ధర తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి GST మార్పులు పన్ను భారాన్ని తగ్గించి సామాన్యులకు పెద్ద ఊరట ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుడికి కొనేశక్తి వస్తుందని, దీంతో ప్రభుత్వ రెవెన్యూ కూడా పెరునగుతుందంటున్నారు విశ్లేషకులు.