Cibil Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువుంటే వడ్డీ ఎక్కువ పడుతుందా.? ఇందులో నిజమెంత..

మరీ ముఖ్యంగా పర్సనల్‌ లోన్‌ చాలా ఈజీగా మారింది. అయితే సిబిల్ స్కోర్ బాగున్న వారికే బ్యాంకులు ఈ సదుపాయం అందిస్తున్నాయి. కనీసం 700 సిబిల్‌ స్కోర్‌ ఉన్న వాళ్లకు పిలిచి మరీ లోన్‌లు ఇస్తున్నాయి. అలాకాకుండా సిబిల్ స్కోర్‌ తక్కువ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోన్‌లు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఎలాంటి పూచికత్తు...

Cibil Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువుంటే వడ్డీ ఎక్కువ పడుతుందా.? ఇందులో నిజమెంత..
Bank Loan

Updated on: Mar 08, 2024 | 5:28 PM

బ్యాంకింగ్‌ రంగంలో వస్తోన్న మార్పుల కారణంగా రుణాల ప్రక్రియ సరళంగా మారింది. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు చాలా త్వరగా రుణాలు పొందే పరిస్థితి ఉంది. బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ప్రీ అప్రూడ్‌ లోన్స్‌ పేరుతో కస్టమర్లు బ్యాంకు గడప తొక్కకుండానే రుణాలో పొందే రోజులు వచ్చేశాయ్‌. కేవలం ఒక్క క్లిక్‌తో ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. అంతలా లోన్‌ ప్రాసెస్‌ సులభంగా మారింది.

మరీ ముఖ్యంగా పర్సనల్‌ లోన్‌ చాలా ఈజీగా మారింది. అయితే సిబిల్ స్కోర్ బాగున్న వారికే బ్యాంకులు ఈ సదుపాయం అందిస్తున్నాయి. కనీసం 700 సిబిల్‌ స్కోర్‌ ఉన్న వాళ్లకు పిలిచి మరీ లోన్‌లు ఇస్తున్నాయి. అలాకాకుండా సిబిల్ స్కోర్‌ తక్కువ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోన్‌లు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఎలాంటి పూచికత్తు లేకుండా ఇచ్చే పర్సనల్‌ లోన్‌కు సిబిల్‌ స్కోర్‌ మాత్రమే ప్రామాణికం కావడంతో బ్యాంకులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాయి.

సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉన్న వారు ఎన్నిసార్లు లోన్‌కు దరఖాస్తు చేసుకున్నా రిజక్ట్‌ చేస్తున్నారు. అయితే లోన్‌ తీసుకునే వారికి సహజంగా ఉండే సందేహాల్లో సిబిల్‌ స్కోర్‌ వడ్డీ రేటుపై ఏమైనా ప్రభావం చూపుతుందా.? సాధారణంగా ఎక్కువ సిబిల్ స్కోర్‌ ఉన్న వాళ్లకి తక్కువ వడ్డీ రేటు పడుతుందని, అలాగే తక్కువ సిబిల్‌ స్కోర్‌ ఉన్న వారికి ఎక్కువ వడ్డీ పడుతుందని భావిస్తుంటారు. అయితే ఇందులో నిజంగానే నిజం ఉందని మీకు తెలుసా.?

సిబిల్ స్కోర్‌ ప్రభావం లోన్‌లోన్స్ వడ్డీ రేట్లపై సిబిల్ స్కోర్ ప్రభావం ఉంటుంది. సిబిల్ స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే.. మీరు తీసుకునే రుణంపై వడ్డీ రేటు మీకు అంత తక్కువగా లభించే అవకాశం ఉంటుందని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే మిమ్మల్ని బ్యాంకులు రిస్క్‌ జాబితాలోకి తీసుకుంటారు. దీంతో వడ్డీరేటు ఎక్కువగా వేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..