
Coins History: ఎంత పెద్ద నోట్లు వచ్చినా.. కాయిన్స్ అనేవి చాలా అవసరం. చిల్లర మార్చుకోవడానికి అయినా… చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేయడానికి అయినా నాణేలు అనేవి అత్యవసరం. అందుకే పెద్ద నోట్లు వచ్చినా నాణేలకు మాత్రం డిమాండ్ తగ్గలేదు. నోట్లు కొన్ని రోజులకు చినిగిపోమే అవకాశం ఉంటుంది.. కానీ కాయిన్స్ మాత్రం ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. అందుకే నాణేల ప్రాముఖ్యత మాత్రం తగ్గడం లేదు. ఇండియాలో రూ.1, రూ.2 రూ.5, రూ.10, రూ.20 కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు గమనిస్తే అన్నీ గుండ్రంగానే ఉంటాయి. ఎందుకు గుండ్రంగానే ఉండాలి? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. దీని వెనుక ఆసక్తికర చరిత్ర, ప్రాముఖ్యత తాగి ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇందులో చూద్దాం.
పురాతన కాలంలో నాణేలపై రాజుల పేరు, రాజ్యాల చిహ్నాలు మనం చరిత్ర బుక్‌లలో చూసి ఉంటాం. అప్పట్లో నాణేలు చతురస్రం, త్రిభుజం వంటి ఆకారాలలో ఉండేవి. వాటికి తాయరుచేసిన లోహం, సాంకేతికను బట్టి ఆకారాలు మారుతూ ఉండేవి. ఇక భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక 1950లో తొలి రూ.1 నాణేంను గుండ్రంగా ఉండే సర్కూలర్ డిజైన్‌తో జారీ చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు రూ.2, రూ.5, రూ.10 నాణేలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రూ.20 కాయిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే గుండ్రటి డిజైన్‌తో కాయిన్స్ ప్రవేశపెట్టాక. .వాటిని మార్చాల్సిన అవసరం రాలేదు. ఈ డిజైన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయనే కారణంతో ఫార్మట్ మార్చలేదు.
పూర్వకాలంలో చతురస్రాకార అంచులు కలిగిన నాణెలు ఉండేవి. ప్రజలు వాటి అంచులను కత్తిరించుకుని లోపల ఉన్న బంగారం లేదా వెండిన తొలగించేవారు. దీని వల్ల ఆ నాణెల విలువ అనేది తగ్గేది. గుండ్రంగా ఉండటం వల్ల అంచులు సమానంగా ఉంటాయి. దీని వల్ల కత్తిరించడం కూడా కష్టం. దీని వల్ల నాణెల విలువ అనేది తగ్గదు. ఇక గుండ్రని నాణెలను ఒకటిపై ఒకటి పేర్చడం చాలా సులువు.దీని వల్ల నాణెలు జారిపోయే ప్రమాదం కూడా ఉండదు. బ్యాంకులు, షాపులు, బస్సు ఆపరేటర్లకు ఇది సులువుగా ఉంటుంది.