ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ ఎలా పొందాలో తెలుసా..! ఈ పద్దతులు పాటించండి..

|

Dec 13, 2021 | 10:41 AM

Fixed Deposits: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నెలలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో COVID-19, Omicron

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ ఎలా పొందాలో తెలుసా..! ఈ పద్దతులు పాటించండి..
Rupee
Follow us on

Fixed Deposits: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నెలలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో COVID-19, Omicron వేరియంట్ దృష్ట్యా రెపో రేటును 4 శాతం వద్ద మార్చకుండా ఉంచాలని నిర్ణయించింది. ఇది చాలా మందికి శుభవార్త కావచ్చు కానీ కొందరికి ఇది బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు కలిగి ఉన్న పెట్టుబడిదారులకు ఇది వర్తిస్తుంది. ఆర్‌బిఐ ఏడాదికి పైగా వడ్డీ రేట్లలో యథాతథ స్థితిని కొనసాగిస్తోంది దీని ప్రభావం ఎఫ్‌డి ఖాతాలు ఉన్నవారిపై పడింది.

సంవత్సరాలుగా అనేక బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCలు) కూడా FDలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే తాజాగా కొన్ని బ్యాంకులు ధరలు పెంచాయి. తాజాగా HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ తమ FD పథకాలపై వడ్డీని పెంచాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులు తమ ఖాతాల నుంచి నెలవారీ రాబడిని ఎలా పెంచుకోవాలో ఆలోచిస్తున్నారు. అలాంటి వారు ఈ చర్యలు తీసుకుంటే వడ్డీని పెంచుకునే అవకాశం ఉంటుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో ఎక్కువ వడ్డీ పొందడానికి ఆర్థిక ప్రణాళికాదారులు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. వారి ప్రకారం.. పెట్టుబడిదారులు తమ ఖాతా నుంచి అధిక రాబడిని పొందడానికి FD నిచ్చెన వ్యూహాన్ని అనుసరించాలన్నారు. అంటే పెద్ద FDని విచ్ఛిన్నం చేసి ఆ డబ్బును స్వల్పకాలిక డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలి. ఇలా చేస్తే మీ డబ్బు తక్కువ వడ్డీ రేట్ల వద్ద లాక్ కాకుండా ఉంటుంది. అదే సమయంలో అధిక మొత్తంలో మీ సగటు రాబడి పెరుగుతుంది.

దీర్ఘకాలిక పెట్టుబడులకు దూరం
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు ఉన్న పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పాలసీలలో పెట్టుబడి పెట్టకూడదు. ఎందుకంటే వడ్డీ తక్కువగా ఉంటుంది. మీ డబ్బు లాక్‌ అయి ఇరుక్కుపోతుంది. అందుకే తక్కువ వ్యవధిలో పెట్టుబడి పెట్టాలి. ఇలా చేస్తే మీ డబ్బును ఎక్కువ కాలం లాక్ చేయకుండా ఉండవచ్చు. మళ్లీ బ్యాంకులు, ఎన్‌బీసీలు వడ్డీ పెంచాలని నిర్ణయించినప్పుడు మీరు రెట్టింపు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు పెంచినప్పుడుల్లా స్వల్పకాలిక లేదా మధ్యకాలిక రేట్లు మొదట పెంచుతారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడిదారులు ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి మీరు స్వల్పకాలిక ఎంపికలలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

ఈ 5 రాశుల వారు విడిపోయిన వారి మాజీలతో మళ్లీ కలుస్తారు..! ఎందుకంటే..?

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీ సరెండర్‌ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ నియమాలు తెలుసుకోండి..

Infinix: ఇండియాలో ఈరోజు 2 స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?