
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సభ్యులకు శుభవార్త తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతానికి వడ్డీ రేటును పెంచుతూ మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో 8.10 శాతం వడ్డీ రేటును పెంచారు. మరి ఈ నేపథ్యంలో చాలా మందికి వారి పీఎఫ్ వాటాపై వడ్డీ ఎలా లెక్కిస్తారో తెలియదు. ఉద్యోగి, యజమాని చేసే కాంట్రిబ్యూషన్స్ (12 శాతం చొప్పున)పై కలిపి ఈపీఎఫ్ వడ్డీని లెక్కిస్తారు. ఇంతకీ ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ రేటును లెక్కించడానికి ఉద్యోగి ప్రస్తుత వయసు, ప్రస్తుత ఈపీఎఫ్ బ్యాలెన్స్, రిటైర్‌మెంట్ ఏజ్ వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ జీతం రూ. 45,000 అనుకుందాం. సదరు ఉద్యోగి ఏప్రిల్ 2022లో ఉద్యోగంలో చేరితే అతనికి ఈపీఎఫ్ వడ్డీ ఇలా అందిస్తారు.
* ఈపీఎఫ్‌లో ఉద్యోగి వాటా 12 శాతం కాగా రూ. 5400 కంట్రిబ్యూట్ అవుతుంది.
* ఈపీఎస్‌లో సంస్థ వాటా 3.67 శాతం కాగా రూ. 1651 కంట్రిబ్యూట్ అవుతుంది.
* ఈపీఎఫ్‌లో సంస్థ వాటా 8.33 శాతం కాగా రూ. 2498 కంట్రిబ్యూట్ అవుతుంది.
* ఈ విధంగా నెలకు రూ. 45000 బేసిక్ శాలరీ వచ్చే ఉద్యోగి జీతం నుంచి ఈపీఎఫ్‌కు మొత్తం రూ. 9,549 కంట్రిబ్యూట్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..