AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: ఆధార్‌ కార్డ్‌లో పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా.?

జేబులో ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అడ్రస్‌ మారినా, ఇంటి పేరు మార్చుకోవాలనుకున్నా, ఫోన్‌ నెంబర్‌ అప్‌డేట్ చేసుకోవాలనుకున్నా ఆధార్‌ అప్‌డేట్ చేసుకోవాల్సిందే. అయితే ఆధార్‌ కార్డులో ఏ వివరాలను ఎన్ని సార్లు మార్చుకునే అవకాశం ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా.?

Aadhaar: ఆధార్‌ కార్డ్‌లో పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా.?
Aadhar Card
Narender Vaitla
|

Updated on: Jan 19, 2024 | 3:49 PM

Share

ఆధార్డ్‌ కార్డ్‌ అన్ని రకాల పనులకు అనివార్యంగా మారింది. సిమ్‌ కార్డు మొదలు విమాన టికెట్‌ వరకు అన్నింటికీ ఆధార్‌ కార్డ్ ఉండాల్సిందే. దీంతో ఎటు వెళ్లినా జేబులో ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అడ్రస్‌ మారినా, ఇంటి పేరు మార్చుకోవాలనుకున్నా, ఫోన్‌ నెంబర్‌ అప్‌డేట్ చేసుకోవాలనుకున్నా ఆధార్‌ అప్‌డేట్ చేసుకోవాల్సిందే. అయితే ఆధార్‌ కార్డులో ఏ వివరాలను ఎన్ని సార్లు మార్చుకునే అవకాశం ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ ఆధార్‌ అప్‌డేట్ విషయంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీని ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చుకోవడం కుదరదు. కేవలం ఒక్కసారి మాత్రమే పేరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరైన కారణం ఉంటే మినహాయింపు ఇస్తారు. ఒకవేళ రెండోసారి పుట్టిన తేదీని మార్చాల్సి వస్తే.. యూఐడీఏఐ జాబితా ప్రకారం చెల్లుబాటు అయ్యే రుజువుతో ఏదైనా ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. ఇందుకు సంబంధించి ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే స్థానికంగా ఉన్న ఆధార్‌ సెంటర్‌ లేదా 1947 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలి.

* ఇక ఆధార్‌ కార్డులో ఫొటోను ఎన్నిసార్లైనా మార్చుకునే అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న ఆధార్‌ ఎన్‌రోల్‌ సెంటర్‌కు వెళ్లి మీ ఫొటో, వేలి ముద్రలు వంటి వాటి ఆధారంగా ఫొటోలను ఎన్నిసార్లైనా మార్చుకునే వెసులుబాటు ఉంది.

* ఇక ఆధార్‌ కార్డులో అడ్రస్‌ను ఎన్నిసార్లైనా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. అడ్రస్‌ మార్పునకు ఎలాంటి పరిమితి లేదు. ఆధార్‌ సెంటర్‌లో సంబంధించిన డాక్యుమెంట్స్‌ని అందించడం ద్వారా ఆధార్‌లో అడ్రస్‌ను మార్చుకోవచ్చు.

* ఆధార్‌ కార్డులో జెండర్‌ను ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం, అవసరమైన డాక్యుమెంట్స్‌ను అందించడం ద్వారా జెండర్‌ అప్‌డేట్‌ను మరోసారి అప్‌డేట్ చేసుకోవచ్చు.

* ఆధార్‌ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి సాధారణంగా.. పాస్‌పోర్ట్, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థ, రెగ్యులేటరీ బోర్డు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఫ్రీడం ఫైటర్ ఫోటో ఐడెంటిటీ కార్డు, టెన్త్ సర్టిఫికెట్‌, టాన్స్‌జెండర్ ఐడెంటిటీ కార్డు, బర్త్‌ సర్టిఫికేట్‌ వంటి సర్టిఫికెట్స్‌ అవసరపడతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇదొక్కటి వేస్తే చాలు.. ఎంత ముదురు మటన్ అయినా మెత్తగా ఉడికిపోద్ది
ఇదొక్కటి వేస్తే చాలు.. ఎంత ముదురు మటన్ అయినా మెత్తగా ఉడికిపోద్ది
చిన్నారుల మెడలో వెండి లాకెట్ ఎందుకు వేస్తారు? సంప్రదాయం వెనుక..
చిన్నారుల మెడలో వెండి లాకెట్ ఎందుకు వేస్తారు? సంప్రదాయం వెనుక..
కొండ గొర్రెలకు ఆ గ్రిప్ ఎలా వస్తుందంటే..
కొండ గొర్రెలకు ఆ గ్రిప్ ఎలా వస్తుందంటే..
ఆధార్ కార్డు వాడేవారికి అదిరిపోయే న్యూస్
ఆధార్ కార్డు వాడేవారికి అదిరిపోయే న్యూస్
ఈ ఖాకీల్లో కఠినత్వమే కాదు.. మనసులో మానవత్వం కూడా ఎక్కువే..
ఈ ఖాకీల్లో కఠినత్వమే కాదు.. మనసులో మానవత్వం కూడా ఎక్కువే..
వంద రోగాలను తరిమికొట్టే వంటకం.. కరివేపాకు మసాలా రైస్ ఎలా చేయాలంటే
వంద రోగాలను తరిమికొట్టే వంటకం.. కరివేపాకు మసాలా రైస్ ఎలా చేయాలంటే
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.. TGPSCనుంచి మరో నోటిఫికేషన్
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.. TGPSCనుంచి మరో నోటిఫికేషన్
రోహిత్ శర్మ రిటైర్మెంట్ రచ్చపై క్లారిటీ ఇచ్చిన యువీ
రోహిత్ శర్మ రిటైర్మెంట్ రచ్చపై క్లారిటీ ఇచ్చిన యువీ
వానాకాలంలో హిమ్యూనిటీని పెంచే రుచికరమైన పచ్చడి.. రోజూ తింటే ..
వానాకాలంలో హిమ్యూనిటీని పెంచే రుచికరమైన పచ్చడి.. రోజూ తింటే ..
2002 ఎస్ఐఆర్‌లో కుటుంబసభ్యుల పేర్లు కనిపించడం లేదా..?
2002 ఎస్ఐఆర్‌లో కుటుంబసభ్యుల పేర్లు కనిపించడం లేదా..?