ATM Card: మీకు ఏటీఎమ్‌ కార్డు ఉందా.? అయితే మీ పేరుపై రూ. 2 లక్షల ఉచిత బీమా ఉన్నట్లే.. పూర్తి వివరాలు..

|

Nov 27, 2022 | 6:45 PM

ప్రస్తుతం ఏటీఎమ్‌ కార్డు లేని వారు ఎవరూ ఉండనరడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బ్యాంకింగ్‌ వ్యవస్థ విస్తృతి పెరగడం, ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల మొత్తాన్ని నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తుండడంతో ప్రతీ ఒక్కరూ బ్యాంక్‌ ఖాతా తీస్తున్నారు. దీనికి తోడు ఏటీఎమ్‌ కార్డుల వినియోగం కూడా భారీగా పెరిగింది...

ATM Card: మీకు ఏటీఎమ్‌ కార్డు ఉందా.? అయితే మీ పేరుపై రూ. 2 లక్షల ఉచిత బీమా ఉన్నట్లే.. పూర్తి వివరాలు..
ATM Card
Follow us on

ప్రస్తుతం ఏటీఎమ్‌ కార్డు లేని వారు ఎవరూ ఉండనరడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బ్యాంకింగ్‌ వ్యవస్థ విస్తృతి పెరగడం, ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల మొత్తాన్ని నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తుండడంతో ప్రతీ ఒక్కరూ బ్యాంక్‌ ఖాతా తీస్తున్నారు. దీనికి తోడు ఏటీఎమ్‌ కార్డుల వినియోగం కూడా భారీగా పెరిగింది. అయితే డెబిట్‌ కార్డ్‌లు కేవలం డబ్బులు తీసుకోవడానికి, షాపింగ్‌ చేయడానికి మాత్రమే కాదు దాంతో పాటు ఉచిత బీమా పొందే అవకాశం కూడా ఉందని మీకు తెలుసా.? చాలా మందికి వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోలేరు. ఇంతకీ డెబిట్ కార్డు ఉన్న వారికి ఎంత బీమా ఉంటుంది.? దీనిని ఎలా క్లైమ్‌ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

బ్యాంక్‌ జారిచేసిన డెబిట్‌ కార్డ్‌ ఉన్న కస్టమర్లు ఉచితంగా ప్రమాద బీమను పొందుతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. కార్డు ఉన్న వారికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బీమా అందిస్తారు. ఈ బీమా కార్డుల రకాలను బట్టి మారుతుంది. ఎస్‌బీఐ గోల్డ్‌ మాస్టర్‌ లేదా వీసా కార్డ్‌ ఉంటే అతనికి రూ. 2 లక్షల భీమా లభిస్తుంది. బ్యాంక్ ప్రకారం, ప్రమాదం జరిగిన తేదీ నుంచి గత 90 రోజులలో ఒకసారి కార్డును ఉపయోగించినప్పుడు ఈ బీమా వర్తిస్తుంది.

ఎవరు అర్హులంటే..

ఒక వ్యక్తి కనీసం 45 రోజుల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఏటీఎమ్‌ను ఉపయోగిస్తే బీమా పొందడానికి అర్హుడు. ఈ సమయం బ్యాంకుల ఆధారంగా మారుతుంది. క్లాసిక్ కార్డ్‌పై రూ.లక్ష, ప్లాటినం కార్డుపై రూ.2 లక్షలు, సాధారణ మాస్టర్ కార్డ్‌పై రూ.50 వేలు, ప్లాటినమ్ మాస్టర్ కార్డ్, వీసా కార్డ్‌లపై రూ.5 లక్షలు పొందవచ్చు. వీసా కార్డుపై 1.5 నుంచి 2 లక్షల రూపాయల వరకు బీమా కవరేజీ అందుతుంది. ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన కింద, వినియోగదారులు రూప్ కార్డ్ ఇన్సూరెన్స్‌పై రూ. ఒకటి నుంచి రెండు లక్షల వరకు బీమా కవరేజీని కూడా పొందుతారు.

ఇవి కూడా చదవండి

ఎలా క్లైమ్‌ చేసుకోవాలంటే..

డెబిట్ కార్డ్ హోల్డర్ ప్రమాదంలో మరణిస్తే, అతని నామినీ సంబంధిత బ్యాంకుకు వెళ్లి బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. నామినీ మరణ ధృవీకరణ పత్రం, ఎఫ్‌ఐఆర్ కాపీ, డిపెండెంట్ సర్టిఫికేట్, మరణించినవారి సర్టిఫికేట్ ఒరిజినల్ కాపీ మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..