SBI Alert : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులందరికి ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తోంది. పలు విషయాలపై అప్రమత్తం చేస్తోంది. ఎస్‌బిఐ ట్విట్టర్ ద్వారా సైబర్ నేరాలపై హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ బ్యాంకింగ్ పెరగడంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఖాతాదారులను రకరకాలుగా బురిడి కొట్టించి సైబర్ నేరస్థులు అందినకాడికి దోచుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో మీ సెల్‌ఫోన్‌కి వచ్చే సందేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్బీఐ సూచిస్తుంది.
ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా ఇటీవల ఓ కస్టమర్‌కు వచ్చిన SMS గురించి వివరిస్తోంది. ఓ బ్యాంకు కస్టమర్‌కి తన ఖాతా బ్లాక్ చేయబడిందని సెల్‌ఫోన్‌కి SMS వచ్చింది. ఇందులో ఒక లింక్ ఇచ్చారు దీనిపై క్లిక్ చేయడం ద్వారా మీ పాన్ కార్డు అప్‌డేట్ అవుతుందని చెప్పారు. ఇది నకిలీ SMS అని దీని ద్వారా కస్టమర్‌ని మోసం చేస్తే ప్రయత్నం జరిగిందని వివరించింది. అటువంటి పరిస్థితిలో మీరు దానిని ఓపెన్ చేయకూడదు. దాని గురించి దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి ఆరా తీయండని సలహా ఇచ్చింది. లేదంటే మోసపోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తుంది. నిమిషాల్లో మీ అకౌంట్ ఖాళీ అవుతుందని తెలిపింది.
యూజర్ ఐడి, పాస్‌వర్డ్, డెబిట్ కార్డ్ నంబర్, పిన్, సివి, ఓటిపి వంటి మీ రహస్య, వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడానికి ఈ మెయిళ్ళు / ఎస్ఎంఎస్ / కాల్స్ / చేయాలని చెబుతోంది. లేదంటే హెల్ప్‌లైన్ నంబర్ 155260 కు కాల్ చేయండని సూచిస్తోంది. ఇటువంటి ఫ్రాడ్ జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెబుతోంది. అలాగే చాలా మంది సోషల్ మీడియా ద్వారా బ్యాంక్ నుంచి సహాయం కోరినప్పుడు లేదా ఫిర్యాదు చేసినప్పుడు వారు తమ ఖాతా వివరాలు, డెబిట్ కార్డు నంబర్, ఆధార్ కార్డు వివరాలను తమ సోషల్ మీడియా పోస్టులలో షేర్ చేస్తున్నారు. బ్యాంక్ ప్రకారం వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ పోర్టల్‌లో పంచుకోకూడదు. దీనివల్ల కలిగే నష్టానికి బ్యాంకు బాధ్యత వహించదు.