LPG Gas: గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేస్తే అదనంగా డబ్బులు ఇస్తున్నారా.? సమాచార హక్కు చట్టం ఏం చెబుతోందంటే..

|

Jan 19, 2023 | 9:37 AM

గ్యాస్‌ సిలిండర్‌ హోమ్‌ డెలివరీ విషయంలో దాదాపు ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్య డెలివరీ ఛార్జీలు. సిలిండర్‌ను ఇంటికి తీసుకొచ్చిన డెలివరి బాయ్స్‌ డబ్బులు అడగడం, మనం ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. అయితే కచ్చితంగా డబ్బులు ఇవ్వాలా వద్దా.? దీనిపై అధికారులు..

LPG Gas: గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేస్తే అదనంగా డబ్బులు ఇస్తున్నారా.? సమాచార హక్కు చట్టం ఏం చెబుతోందంటే..
Gas Cylinder
Follow us on

గ్యాస్‌ సిలిండర్‌ హోమ్‌ డెలివరీ విషయంలో దాదాపు ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్య డెలివరీ ఛార్జీలు. సిలిండర్‌ను ఇంటికి తీసుకొచ్చిన డెలివరి బాయ్స్‌ డబ్బులు అడగడం, మనం ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. అయితే కచ్చితంగా డబ్బులు ఇవ్వాలా వద్దా.? దీనిపై అధికారులు ఏం చెబుతున్నారు? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌కు చెందిన రాబిన్‌ జాకీస్‌ అనే సామాజిక కార్యకర్త గ్యాస్‌ సిలిండర్‌ను డెలివరీ చేసినందుకు డబ్బులు చెల్లించాలా అనే సమాచారం కోసం ఆర్టీఐని ఆశ్రయించాడు. దీనికి బదులిచ్చిన హిందుస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌ గ్యాస్‌ సంస్థ డెలివరీకి ఎలాంటి అదనపు ఛార్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ స్పందిస్తూ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో డీలర్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా.. తమ ట్రేడింగ్ ఏరియాలో ఉచితంగా సిలిండర్‌ల డెలివరీ చేయడం డిస్ట్రిబ్యూటర్‌ బాధ్యత అని స్పష్టం చేసింది.

గతేడాది డిసెంబర్‌ 29న సమాచారాన్ని కోరుతూ ఆర్టీఐలో దాఖలైన పిటిషన్‌ను పెట్రోలియం మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ఈ ప్రశ్నకు బదులిస్తూ.. బిల్లులో పేర్కొన్న దాని కంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక పిటిషనర్‌ తన పిటిషన్‌లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు ఛార్జీలు వసూలు చేయడానికి అధికారం ఉందా, వారి జీతాలు డెలివరీ ఛార్జీల ఆధారంగా చెల్లిస్తారా పేర్కొన్నారు. అయితే ఈ ఇది సమాచార హక్కు చట్టం 2005లోని సెక్షన్ 2(ఎఫ్) పరిధికి మించినదని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా 2018 నుంచి 2022 వరకు వినియోగదారుల ఫిర్యాదుల నివేదికలు, ఏడాది వారీ డేటాను అడిగారు దీనికి కంపెనీ బదులిస్తూ.. ‘ప్రశ్న నిర్దిష్టమైని కాదని’ బదులిచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..