అన్ని రంగాల్లో ఆఫర్ల సీజన్ నడుస్తోంది. అన్ని ప్లాట్ ఫారంలలో విభిన్న రకాల వస్తువులపై పలు రకాల తగ్గింపులు, క్యాష్ బ్యాక్ లను అందిస్తున్నాయి. ఫలితంగా కొనుగోలుదారులు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే క్రమంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలు కూడా ఫెస్టివ్ సేల్స్ నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ ఈవీ తయారీ దారు, బెంగళూరు కేంద్రంగా నడిచే ఓలా ఎలక్ట్రిక్ కూడా ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తోంది. ఇది పరిమిత కాలం ఆఫర్ మాత్రమేనని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులు మొత్తం మీద రూ. 26,500 వరకూ వివిధ రకాల ప్రయోజనాలు పొందొచ్చని పేర్కొంది. ఎక్స్ టెండెడ్ బ్యాటరీ వారంటీ, ఎక్స్ చేంజ్ బోనస్, డిస్కౌంట్ కాంప్రిహెన్సివ్ వారంటీ అందుబాటులో ఉంటుంది. నవంబర్ పదో తేదీ నుంచి రూ. 2000 డిస్కౌంట్ ను పొందొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ తన లేటెస్ట్ లైనప్ లో ఎస్1 ఎక్స్, ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్లను కలిగి ఉంది. ఎస్1 ఎక్స్, ఎస్1 ఎక్స్ ప్లస్(3కేడబ్ల్యూహెచ్), ఎస్1 ఎక్స్(2కేడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో అందుబాటులో ఉంది. ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ రూ. 1,09,999 ఎక్స్ షోరూం ధరకు అందుబాటులో ఉంది. అలాగే సెకండ్ జెనరేషన్ ఎస్1 ప్రో డెలివరీలు ఇప్పటికే 100 నగరాలకు పైగా ప్రారంభమయ్యాయి. ఎస్1 ఎయిర్ స్కూటర్ ను రూ. 1,19,99ఎక్స్ షోరూం ధరకు అందుబాటులో ఉంది. ఎస్1 ఎక్స్(3కేడబ్ల్యూహెచ్) ఎస్1 ఎక్స్(2కేడబ్ల్యూహెచ్) స్కూటర్లను కేవలం రూ. 999కే బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..